మెగాస్టార్ చిరంజీవి నటనలో నలభయ్యేళ్ల మైలు రాయిని దాటేసారు. ఆయన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు నుంచి కూడా జనాలను ఆకట్టుకుంటూనే ఉన్నారు. మంచి ఈజ్ తో ఆటు డ్యాసులు, ఫైట్లు ఇరగదీస్తూ చిరంజీవి తనకు తానే సాటి అని ఎనభై దశకంలోనే ప్రూవ్ చేసుకున్నాడు. అప్పట్లో టాప్ ఫోర్ గా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబులను అధిగమించి తనకంటూ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు.

 

అటువంటి చిరంజీవి నటుడు కావాలనుకుని చెన్నైలో ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆయన కోర్సులో ఉండగానే చాన్సులు అలా వచ్చేశాయి. తాను పాత్రలు కావాలంటూ ఎవరిని అడగకుండానే ఒక్కసారిగా డిమాండ్ ఉన్న నటుడిని అయిపోయానని కూడా మెగాస్టార్ చెప్తూంటారు.

 

ఇవన్నీ ఒక ఎత్తు అయింతే మెగాస్టార్ నటనలో మెలకువలు నిజంగా యాక్టింగ్ స్కూల్లో నేర్చుకోలేద‌ట. అక్కడ ఏం నేర్పారు, ఏం నేర్చుకున్నానో నాకే తెలియదు. కానీ నటన అంటే ఏమిటి అని నేర్చుకున్నది మాత్రం కళా తపస్వి కె విశ్వనాధ్ వద్దనేనని చిరంజీవి చెప్పుకొచ్చారు.

 

తనకు విశ్వనాధ్ డైరెక్షన్లో నటించే అవకాశం శుభలేఖ మూవీలో వచ్చిందని ఆయన చెప్పారు. ఆ మూవీలో తనను బాగా సానపట్టి నటుడిని వెలికితీసింది మాత్రం విశ్వనాధేనని చిరంజీవి అంటారు. డైలాగ్ డెలివరీ నుంచి, అభినయం ఎలా చేయాలి. భావాలు ఎలా పలికించాలి అన్నీ కూడా విశ్వనాధ్ స్వయంగా తనకు చేసి చూపించి నటుడిగా తీర్చిదిద్దారని చిరంజీవి వినమ్రంగా తన గురువు గురించి చెప్పుకున్నారు.

 

తనకు మొదట్లో అలా విశ్వనాధ్ వంటి గురువు దొరకడం వల్లనే మంచి నటుడిని అనిపించుకున్నానని కూడా చిరంజీవి చెబుతున్నారు. మొత్తానికి యాక్టింగ్ స్కూల్స్, కోర్సులు వంటి వాటి కంటే కళా తపస్వి లాంటి వారు ఒక్కరు చాలు. ఆయనే ఒక విశ్వవిద్యాలయం. ఇది చిరంజీవి చెబుతున్న మనసులోని మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: