నితిన్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మొదటి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ సాధించింది. గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతోన్న నితిన్ ఈ మూవీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ మూవీ ఓపెనింగ్స్ ను చూసి కచ్చితంగా.. నితిన్ కెరీర్ బెస్ట్ అయిన 'అఆ' కలెక్షన్లను అధిగమిస్తుంది అని అంతా భావించారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల రూ. 35 కోట్లు అనున్నప్పటికీ  22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ 28.30 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. తాజాగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది.  అయితే ఎప్పుడు హీరో నితిన్‌కు పెద్ద దెబ్బ తగిలింది.

 

 ఇప్పటికే ఈ మూవీ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. అయితే ఫిబ్రవరి బ్లాక్ బస్టర్ అయిన 'మిర్చి' కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. ఓవర్సీస్ లో ఈపాటికే 1 మిలియన్ దాటుతుంది అనుకుంటే.. అక్కడ కూడా దెబ్బ పడిందనే చెప్పాలి. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ‘భీష్మ’కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. భీష్మ సినిమా పై తెలంగాణ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు గంగపుత్రులను కించపరిచేలా ఉన్నాయని  హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌లో ఆ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ ఫిర్యాదు చేసాడు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా  అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. అలాంటి సన్నివేశాలను ‘భీష్మ’ సినిమాన నుంచి వెంటనే తొలిగించాలని రాజేశ్వర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ వల్ల కష్టాలు పడుతున్న సమయంలో మరో ఉపద్రవం వచ్చిపడిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: