తెలుగులో మూడేళ్లుగా బాగా ఆదరణ పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో కు తెలుగు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయిపోయారో తెలిసిన విషయమే. ఇప్పటి వరకూ జరిగిన మూడు సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో నాలుగో సీజన్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఇందుకు సంబంధించి లేటెస్ట్ గా రౌండ్ అవుతున్న సమాచారం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నాలుగో సీజన్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును రంగంలోకి దించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.

 

 

బిగ్ బాస్ మొదటి మూడు సీజన్లకు వరుసగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఏ సీజన్ కా సీజన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మూడో సీజన్ ఫైనల్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి విన్నర్ ను ప్రకటించడం మూడో సీజన్ కు హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం నాలుగో సీజన్ కు మహేశ్ ఒప్పించేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. దీనిపై ప్రస్తుతానికి పూర్తి అఫిషియల్ న్యూస్ రానప్పటికీ ఇప్పటి నుంచే హోస్ట్ ను నిర్ణయిస్తే సీజన్ ప్రారంభానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 

 

వచ్చే జూన్ లో నాలుగో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రియాల్టీ షోలు లేకుండా ఇప్పుడు ఏ ఎంటర్ టైన్మెంట్ చానెల్ కూడా రన్ కావడం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో సినీ సెలబ్రిటీ హోస్టింగ్, అతిథులుగా స్టార్లు, సూపర్ స్టార్లు, విచిత్రమైన టాస్కులు, కంటెస్టెంట్ ల మధ్య పోటీలు, వాగ్వివాదాలు.. ఇలా షో రన్ అయ్యే సీజన్ అంతా ఉండే హంగామా అంతా ఇంతా కాదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: