తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చేశాడు. పార్టీ పేరు ప్రస్తావించకుండానే రాజకీయ అరంగేట్రం ఖాయం చేసేశాడు. తాను చేయాలనుకున్న దానిని స్పష్టంగా చెప్పేశాడు. ‘రాజకీయాల్లోకి వస్తున్నాను కానీ.. సీఎంగా ఉండను.. పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాను’ అని. ఇప్పుడదే హాట్ టాపిక్ గా మారుతోంది. రజనీ రాజకీయ అరంగేట్రంపై రజినీ ఫ్యాన్స్ పెద్దగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి.

 

 

రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తే సీఎంగా చూడాలనేది అభిమానుల కోరిక. కానీ పార్టీ అధ్యక్షుడిగానే ఉంటాను అంటే అధికారం రెండు చేతుల్లో ఉన్నట్టే కదా అని అంటున్నారు. రజినీ పార్టీ నిజంగా అధికారంలోకి వస్తే పార్టీ అధ్యక్షుడిగా రజినీ బాస్ అవుతారా.. రజినీ చేస్తానన్న సీఎం బాస్ అవుతారా అనేది అభిమానులకు అర్ధం కావటం లేదు. ఇదే జరిగితే పార్టీలో అంతర్గత పోరు ఖాయమేగా అంటున్నారు. ఒకరకంగా ఆలోచిస్తే రజినీ అభిమానుల కలవరపాటు నిజమే. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నా కానీ వెనుకుండి పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీనే అంతా నడిపించారని ఎన్నో విమర్శలు వచ్చాయి. మన్మోహన్ కు అధికారం లేదు.. సంతకాలు చేయడమే పని అని విమర్శలు వచ్చాయి.

 

 

జాతీయ పార్టీ కాబట్టి సరిపోయింది. ప్రాంతీయ పార్టీలో ఇది చెల్లుబాటు అవుతుందా అనేదే ప్రశ్న. రజినీ వెనుకండి అన్నీ నడిపించడమంటే తమిళ ప్రజలకు రుచించని విషయమే ఇది. రజీనీనే సీఎం కాకపోతే ఇక ఓట్లేసి ఏం లాభం అనుకోవచ్చు. రజినీ తీసుకున్న నిర్ణయం స్టైలిష్ గా ఉందేమో కానీ.. ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదంటున్నారు. ఇతర పార్టీలు కూడా రజినీ నిర్ణయంపై విమర్శలు చేసే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: