సినిమా రంగంలో హిట్లు పడితేనే వటీనటులకు క్రేజ్ ఉంటుంది.. లేదంటే కొంత గ్యాప్ వచ్చిందంటే, అతనితో సినిమా తీయడానికి నిర్మాతలు భయడతారు.. అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఫర్వాలేదు కానీ ఫ్లాపులతో గ్యాప్ తీసుకుంటే మాత్రం కుదురుకోవాలంటే మరో హిట్టుపడేదాక నిరాశ తప్పదు.. ఇలాంటి పరిస్దితినే ఎదుర్కొంటున్న ఒక పెద్ద స్టార్ హీరో. కొంత గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడట.

 

 

అయితే సినిమా పరిశ్రమలో ఇలా గ్యాప్ తర్వాత పెద్ద స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడని అనౌన్స్ అవుతే దానికున్న పబ్లిసిటీ, పెరగడమే కాదు ఆ చిత్రం పై భారీ క్రేజ్ కూడా ఏర్పడుతుంది.. కానీ ఆ స్థాయి క్రేజ్ ఈ సినిమాపై కనిపించడం లేదు.. అయితే దీనికి కారణం మాత్రం ఈ స్టార్ హీరో అతని శైలికి భిన్నంగా ఉండే కథను ఎంచుకోవడం వల్లనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా అసలు క్రేజీ లేని ఈ సినిమా విషయంలో మాత్రం సోషల్ మీడియాలో క్రేజ్ ఉందంటూ ఊదరగొడుతున్నారట.. అసలే బిజినెస్ జరగడం లేదు, డిజిటల్ రైట్స్ విషయంలో నిర్మాతలు ఆశించినంత రేట్లు రావడంలేదట. ఇవన్ని ఆలోచిస్తే, ఒకరకంగా ఈ చిత్రానికి లాస్ వచ్చినట్టేనని అంటున్నారు.

 

 

ఇదే కాకుండా థియేట్రికల్ రైట్స్ కూడా తక్కువ రేట్లు ఆఫర్ చేస్తున్నారట. నిర్మాత భారీగానే చెప్తున్నప్పటికీ బయ్యర్లు మాత్రం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారట. ఇలాంటి నష్టాలకు భయపడిన నిర్మాత ఒక ఐటెం సాంగ్ ఈ సినిమాలో పెడితే అయినా క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడట. అయితే హీరో మాత్రం వద్దంటున్నాడని అనుకుంటున్నారు.. అసలే ఈ సినిమా కథకు సంబంధం లేకుండా హీరో ఇమేజ్ కోసం సినిమాను కిచిడి చేస్తున్నారనే టాక్ ఉంది.

 

 

ఇక ఈ ఐటెం సాంగ్ కూడా పెడితే 100% కిచిడి అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిర్మాత మాట నెగ్గించుకుంటే మాత్రం ఈ కిచిడికి చట్నీ కలుపుకుని తిన్నా రుచి రాకుంటే ఈ సినిమా హీరో భవిష్యత్తు ఏంటని అనుకుంటున్నారట.. ఇక ఇంత చెప్పిన ఆ హీరో ఎవరనేది చెప్పడం లేదు.. అది మీ ఊహకే వదిలేస్తున్నాను.. 

మరింత సమాచారం తెలుసుకోండి: