వర్ధమాన నటి శ్రీరెడ్డి, అక్కడక్కడా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించడంతో పాటు అంతకముందు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. అయితే కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు సినిమా వ్యక్తులు, కొత్తగా సినిమాల్లోకి అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను మేము అవకాశాలు ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి లోబరుచుకుని, వారిని లైంగికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ విషయమై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు, కొత్తగా అవకాశాల కోసం వస్తున్న ఆడవారికి న్యాయం చేయాలని అసోసియేషన్ ముందు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. 

 

ఇక ఆ ఘటనతో ఎంతో పాపులరైన శ్రీరెడ్డి, ఆపై ఒకానొక సమయంలో టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అదే సమయంలో కొందరు సినిమా ప్రముఖులు తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, ఒక ప్రముఖ నిర్మాత తనయుడితో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత మరికొందరి పేర్లు బయటపెట్టి సంచలనం రేపింది. ఇక కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుండి పూర్తిగా చెన్నైకి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి, ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇంకా కొందరు నటులపై విమర్శలు చేస్తూనే ఉంది. 

 

ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి, నాచురల్ స్టార్ నాని పై కూడా సెటైరికల్ గా కొన్ని విమర్శలు చేస్తోంది. ఇక ఇటీవల పవన్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కు సంబంధించి కూడా ఒక సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి, మరొక్కమారు పవన్ ఫ్యాన్స్ నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. నువ్వు ఏమి ఆశించి కావాలనే మెగా ఫ్యామిలీ మీద, అలానే పవర్ స్టార్ మీద కామెంట్స్ చేస్తున్నావో మాకు తెలియదు, కానీ పవన్ అంటే ఏమిటో ప్రజలకు తెలుసు, నీది నోరా లేక తాటి మట్టా, నోటికి ఏదోస్తే అది మాట్లాడేయడమేనా, సంస్కారం ఉండక్కర్లా అంటూ కొందరు అభిమానులు ఆగ్రహంతో ఆమెపై కామెంట్స్ చేయడం మొదలెట్టారు. మరి ఇకనైనా శ్రీరెడ్డి పవన్ టార్గెట్ గా ఇటువంటి పోస్టులు చేయడం అవుతుందో లేదో చూడాలి...!!  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: