దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. షూటింగ్ అనౌన్స్ చేసిన నాటి నుంచీ ఎంతో క్యూరియాసిటీ, బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా తమ ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఉగాది సందర్భంగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ ఉంటాయని సమాచారం. కానీ ఇప్పుడు ముందుగానే ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.

 

 

ఆర్ఆర్ఆర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ పూనేలో స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. గతంలో ఓసారి అక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తే అవసరమైన అనుమతులు రాకపోవడంతో షూటింగ్ చెన్నైకు మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని అనుమతులు లభించాయని సమాచారం. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ అలియా భట్ సెట్ లో జాయిన్ అవుతోందని సమాచారం. రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడట. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు పాట కూడా చిత్రీకరిస్తారని అంటున్నారు. అతి త్వరలోనే ఈ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట  కాబోతోందని అంటున్నారు. దీనిపై అఫిషియల్ న్యూస్ ను యూనిట్ రివీల్ చేయకపోయినా ఫిలింనగర్లో ఈ వార్త రౌండ్ అవుతోంది.

 

 

రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ కాగా, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటివరకూ రామ్ చరణ్ అప్డేట్స్ కోసం ఎదురు చూసిన మెగా అభిమానులకు ఈ వార్త వారిని ఖుషీ చేసేదే. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అజయ్ దేవగన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: