తెలుగునాట టెలివిజన్ రంగంలో యాంకరింగ్ లో క్వీన్ లా దూసుకుపోతున్న యాంకర్ సుమ. ఓ కార్యక్రమం జరుగుతోందంటే సుమ పేరే అందరికీ గుర్తొస్తుంది. సుమ లేని ప్రోగ్రామ్ ని ఊహించుకోవటమే కష్టం అన్నట్టు తెలుగులో ఆమె హవా సాగుతోందనడంలో సందేహం లేదు. యాంకరింగ్ కే వన్నె తెస్తున్న సుమ స్రస్థానం ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల క్రితమే సుమ ప్రస్థానం టీవీ రంగంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ యాంకరింగ్ రంగంలో ఆమె ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది.

 

 

జెమినీ టీవీలో యువర్స్ లవింగ్లీ ప్రోగ్రామ్ ఎందరికో దారి చూపిందనే చెప్పాలి. తొలి ఎంటర్ టైన్మెంట్ చానెల్ గా పేరు తెచ్చుకున్న జెమినీలో ఉదయం యువర్స్ లవింగ్లీ కార్యక్రమం ప్రసారమయ్యేది. వీవర్స్ నుంచి వచ్చే ఉత్తారాలు చదివి వారికి బర్త్ డే విసెష్ చెప్తూ.. వారు కోరే పాటలు వేయడమే ఆ కార్యక్రమంలో చేసేది. అలా మొదలైన సుమ పయనం నేటికీ కొనసాగుతోంది. యాంకరింగ్ లో మరొకరి పేరు కూడా ప్రస్తావనకు రాకుండా తన వాగ్దాటితో ఆకట్టుకుంటోంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. క్లిష్టమైన పదాలను అవలీలగా పలుకుతూ.. చమత్కారంగా మాట్లాడే సుమ తెలుగు అమ్మాయి కాదు. ఆమె మళయాళీ. కానీ.. సుమ తెలుగులో మాట్లాడే విధనం చూసి ఆమె మళయాళీ అనే స్పృహే ఎవరికీ రాదు.

 

 

సుమ యాంకరింగ్ చూసి దర్శకరత్న దాసరి నారాయణరావు తను తీస్తున్న ప్రేమకథా చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. కథా రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాలో హీరో. యాంకరింగ్ రంగమే తీసుకుంటే సుమ నెంబర్ వన్ యాంకర్ అనే చెప్పాలి. ఆమెకు పోటీనిచ్చే వారు దరిదాపుల్లో లేరు. రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమ సమీప భవిష్యత్తులో కూడా రాణించడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: