ముందుగా సినిమా పరిశ్రమకు కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అక్కడి నుండి మెల్లగా తన టాలెంట్ తో వరుసగా మంచి అవకాశాలు అందుకుని ప్రేక్షకుల మనసుల్లో తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో మంచి పేరు గడించారు. ఆపై తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, మొన్నటి అలవైకుంఠపురములో సినిమా వరకు పలువురు హీరోలతో సినిమాలు తీసి మంచి సక్సెస్ లతో పాటు మధ్యలో కొన్ని ఘోర పరాజయాలు కూడా చవి చూసారు. ఇక ప్రస్తుతం తన తదుపరి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథ, పూర్తి స్క్రిప్ట్ విషయమై తన టీమ్ తో పలు విధాలుగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

గతంలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన తీసిన అరవింద సమేత సినిమా మంచి హిట్ కొట్టినప్పటికీ, ఆ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచెస్, అలానే ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు తగ్గాయని కొద్దిపాటి విమర్శలు రావడంతో, ఈసారి ఆయన తో చేయబోయే సినిమా విషయమై ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా పక్కాగా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు కమర్షియల్ అంశాలు ఆ సినిమాలో ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. 

 

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మరొక్కసారి ఎన్టీఆర్ సరసన అందాల పూజ హెగ్డే నే హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. వాస్తవానికి అరవింద సమెత తో పాటు మొన్న త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో కూడా ఆమే హీరోయిన్. అయితే ఆమెతో త్రివిక్రమ్ కు మంచి ర్యాపో ఏర్పడిందని, అలానే ఆమెతో ఆయన తీసిన రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ కొట్టడంతో ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకుని మళ్ళి హిట్ కొట్టేందుకు గట్టిగా ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, కొందరు నెటిజన్లు మాత్రం అబ్బా గురూజీ, ఆ హీరోయిన్ ని ఇక వదలరా అంటూ సరదాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయన పై కామెంట్స్ చేస్తున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: