ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే అందరూ ముందు ప్రభాస్ నే చూస్తారు. ఇక హీరోయిన్స్ అనగానే ముందు అనుష్క. అంతేకాదు వీళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఏళ్ళకి ఏళ్ళు గడుస్తున్నా అనుష్క కోసం ప్రభాస్ పెళ్ళి చేసుకోకుండా ఆగాడని, అలాగే ప్రభాస్ అనుష్క కోసం పెళ్ళి చేసుకోకుండా వేయిట్ చేస్తున్నాడని జనాలు తెగ చెప్పుకుంటున్నారు. పోనీ ఈ విషయంలో పక్కాగా క్లారిటి ఈ ఇద్దరిలో ఒక్కరన్నా ఇస్తారా అంటే అదీ లేదు. దానికి తోడు ఈ ఇద్దరు ఎకువగా పబ్లిక్ ఫంక్షన్స్ కి కలిసి రావడమూ అందరి అనుమానాలకి బలాన్ని చేకూరుస్తుంది.

 

ఇదే కాదు వీళ్ళని ఏ ఇంటర్యూ లో పెళ్ళి గురించి అడిగినా ఒకరికోకరు సిగ్గు పడుతూ ఏం లేదని సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆ సమాధానమే ఇంకా వీళ్ళ పెళ్ళి గురించి రక రకాలుగా రసేసేలా చేస్తుంది. అదీ గాక ఇండస్ట్రీ వర్గాల్లో చాలామంది ప్రభాస్ కి అనుష్క కి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టమని కాని కొన్ని కారణాలతో పెళ్ళి మ్యాటర్ ని ఈ ఇద్దరు దాటేస్తున్నారని అంటారు. మరి ఇందులో నిజమెంత ఉందో గాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి పెళ్ళి అయితే గాని ఈ మ్యాటర్ క్లోజ్ అవదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ తో మాత్రం జనాలతో పాటు సరదాగా ప్రభాస్ అనుష్క కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటి తమన్నా చేసిన వ్యాఖ్యలు ముందు జనాలకి షాకిచ్చాయి. అంతేకాదు చాలా అనుమాలకి తావిచ్చాయి. ఇంతకి తమన్నా ఏమనిందో తెలుసా ..నాకు ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవాలని ఉందని ప్రభాస్ తో పాటు మరో రెండు పేర్లు చెప్పి ఈ ముగ్గురు లా అనిపించే వ్యక్తి ని పెళ్ళి చేసుకోవాలని ఉందని వెల్లడించింది. అయితే మిగతా ఇద్దరి విషయం ఎవరూ పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. కానీ ప్రభాస్ కి తమన్నాతో పెళ్ళి అని మాత్రం డిక్లేర్ చేసేశారు. అంతేకాదు తన మనసులో ఏ ఆలోచన లేకపోతే ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవాలని ఉందని ఎందుకంటుందని ఆరా తీస్తున్నారు.

 

ఈ మాటలు విన్న అనుష్క షాకైందట. తమన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అసలు ఊహించని అనుష్క ఇప్పుడొచ్చి ప్రభాస్ ని పెళ్ళి చేసుకుంటానంటే ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న దాన్ని వెర్రిదాన్నా అంటూ తమన్నాకి కౌంటర్ ఇచ్చిందట. ఇలా అనుష్క కౌంటర్ ఇచ్చి ప్రభాస్ అంటే ఎంతిష్టమో క్లారిటి ఇచ్చిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: