సినిమా రంగంలో తిరుగులేకుండా రాణిస్తున్న వారు బుల్లి తెరకు రావడం సంతోషించదగ్గ విషయమే. బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి ఇదొక మార్గమనే చెప్పాలి. సినిమాల్లో మూడు దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా రాణిస్తున్న కింగ్ నాగార్జున టీవీ రంగంలో అడుగుపెట్టడం శుభపరిణామం. అసలే స్టైలిష్ గా ఉండే నాగార్జున తన వాక్ చాతుర్యంతో టీవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. తన మార్క్ డైలాగులతో, స్టైలిష్ గా నాగార్జున యాంకరింగ్ లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

 

 

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా నాగార్జున టీవీ రంగంలో తనదైన ముద్ర వేసారనే చెప్పాలి. ప్రశ్నలు వేస్తూ కంటెస్టెంట్ల నుంచి సమాధానం రాబట్టడం.. మధ్యమధ్యలో వారి గురించి చాతుర్యంగా మాట్లాడటం కత్తి మీద సాము లాంటి పనే. వారి నుంచి సమాధానాలు రాబట్టే సమయంలో నాగార్జున చూపించిన సమయస్ఫూర్తి గ్రేట్ అనే చెప్పాలి. ఆ కార్యక్రమంలో నాగార్జున చూపిన సమయస్ఫూర్తే ఆయనకు రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి పిలుపొచ్చిందని చెప్పాలి. ఆ కార్యక్రమాన్ని కూడా నాగార్జున తనదైన శైలిలో రక్తి కట్టించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ల తో మాట్లాడటం, వారి నుంచి సమాధానాలు రాబట్టడం, వారిని మాటలతో ఎంటర్ టైన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ రెండు కార్యక్రమాల్లో నాగార్జున సక్సెస్ అయ్యారు.

 

 

ఈ రెండు షోల్లో నాగార్జున చూపించిన యాక్టివ్ నెస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందని చెప్పడానికి ఆ కార్యక్రమాలకు వచ్చిన రేటింగ్సే ఉదాహరణ. కార్యక్రమాల్లో భాగంగా సినీ సెలబ్రిటీలతో చాకచక్యంగా మాట్లాడుతూ ప్రోగ్రామ్ ను నడిపించడంలో నాగార్జున బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఆకట్టుకున్నారు. సినిమాల్లో బిజిగా ఉంటూ కూడా ఆయన టెలివిజన్ రంగాన్ని ప్రోత్సహించాలని తీసుకున్న నిర్ణయం ఎంతైనా ఆహ్వానించదగ్గది అనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: