తాప్సి టాలీవుడ్ లో ఫ్లాప్ హీరోయిన్ గా ఫేడవుట్ అయిపోయింది. కానీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రత్యేకించి కొన్ని కథలు తాప్సీనే వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ కథల తోనే తాప్సీ సూపర్ హిట్స్ ని అందుకుంటోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోనే రెండు సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. అయితే కొన్ని కాంట్రవర్సీలతో మీడియాలో బాగా హైలెట్ అవుతోంది తాప్సీ. ఒక రకంగా కంగన సిస్టర్స్ తర్వాత కొన్ని విషయాలలో రెచ్చిపోయి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేది తాప్సీ పన్ను నే అని చెప్పాలి. 

 

ఇక బాలీవుడ్ లో తాప్సీ ప్ర‌ధాన పాత్ర పోషించిన ‘థప్పడ్‌’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవ‌డంతో పాటు ఘ‌న విజ‌యం సాధించింది. మరో హిట్ ని తన ఖాతాలో వేసుకొని మాంచి జోష్ లో ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో తాప్సీ న‌ట‌నకి మంచి పేరు వచ్చింది. దాంతో బాలీవుడ్ ప్ర‌ముఖులంతా తాప్సీపై ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌టంతో కాలు నేల మీద నిలవడం లేదు. దాంతో తాప్సీకి బాగా అలవాటైన పని చేసింది. ఇందులో కూడా తన మార్క్ క్రియోటివిటీని బాగా వాడింది.

 

ఈ సక్సస్ కి సంబంధించి వెల్లడిస్తూ ‘నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే చీకటిని జయించాను. నేను నిరాడంబరంగా ఉన్నాను. ఎందుకంటే.. నేను నిరాశను ఎదుర్కొన్నాను.  బలవంతురాలిని.. ఎందుకంటే పరిస్థితులు నన్ను అలా మార్చాయి. కృతజ్ఞతతో ఉన్నాను... ఎందుకంటే నష్టాన్ని తెలుసుకున్నాను. ఇక నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అంటూ కొన్ని ఇన్స్పైరింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ కమెంట్స్ ఒకరకంగా టాలీవుడ్ వాళ్ళని టార్గెట్ చేస్తూ చేసినట్టుంది అని కొందరు అంటున్నారు. అంతేకాదు కానీ నీ టైం అలా నడుస్తోంది అంటూ పంచ్ లేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: