హీరో నాని వరుసగా ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నాడు. మహేష్ బాబు  ఇప్పుడు నెక్ట్స్ సినిమా చెయ్యడానికి కథలు వినడంలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఆల్రెడీ బన్నీతో  భారీ లెవల్లో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ఇంత బిజీలో..కాస్త టైమ్ దొరికితే బావుండు రిలాక్స్ అవుదాం కదా అనుకుంటారు... కానీ వీళ్లు మాత్రం ఎక్స్ ట్రా పని నెత్తిమీదేసుకుని మేం ఖాళీగా ఉండం అంటున్నారు.

 

మహేష్ బాబు  మొన్నటి వరకూ  బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు.  రిలీజ్ అయ్యాక ఈ సినిమా  సూపర్ సక్సెస్ ని  ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు ..ఇప్పుడు నెక్ట్స్ సినిమా చెయ్యడానికి ఖాళీగా ఉన్నాడు కదా అని  కథలు కూడా  వింటున్నాడు . సరే ఇప్పటి వరకూ కష్టపడ్డాం కాస్త రిలాక్స్ అవుదాం అనుకోకుండా మేజర్ పనులు మీదేసుకున్నాడు . అదే ..మహేష్ బాబు ప్రొడక్షన్ లో అడవిశేష్, శోభిత లీడ్ రోల్స్ లో వస్తున్న మేజర్ సినిమా పనుల్ని మానిటర్ చేస్తున్నాడు. 

 

నాని.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు . ఈ సంవత్సరం వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ ఈ మూడు సినిమాల షూట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎట్టి పరిస్తితుల్లో ఈ సంవత్సరం 3 సినిమాలను రిలీజ్ చెయ్యడమే టార్గెట్ పెట్టుకున్నాడు. అంతేకాదు .. తన ప్రొడక్షన్ లో రీసెంట్ గా వచ్చిన హిట్ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . సరే హిట్ అయ్యిందని రిలాక్స్ అవుతాన్నాడా అంటే.. అబ్బే అదేంలేదు..ఈ సినిమాని సీక్వెల్ తీస్తాను అంటూ ఆ పనుల్ని మీదేసుకున్నాడు.

 

సుకుమార్ తన మార్క్ సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటే ఈ డైరెక్టర్ 2018 లో రంగస్థలం సినిమా చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బన్నీ తో సినిమా చేస్తున్నాడు. అబ్బ ఈ సంవత్సరం టైమ్ లో ఫుల్ రిలాక్స్ అయిపోయాడు  అనుకున్నారు అంతా. కానీ ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో సుకుమార్ రైటింగ్స్ లో ఉప్పెన తో పాటు..  లేటెస్ట్ గా నిఖిల్ తో 18 పేజెస్ అనే సినిమాలకు  స్టోరీ , స్క్రీన్ ప్లే అందిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు.  మేం అసలు ఖాళీగా ఉండం సినిమాలు లేకపోయినా..ఫుల్ బిజీగా ఉంటాం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: