టాలీవుడ్ యాంకర్స్ లో అనసూయ భరధ్వాజ్ ది సెపరేట్ స్టైల్. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క తన అంద చందాలతో అలరిస్తుంది ఈ అమ్మడు. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ తెలుగులో ఫామ్ లో ఉన్న టాప్ యాంకర్స్ లో ఒకరని చెప్పొచ్చు. మిగతా షోలు ఎలా ఉన్నా జబర్దస్త్ లో మాత్రం ఆమె పర్మినెంట్ యాంకర్. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రష్మీ కూడా తన సత్తా చాటుతూ వస్తుంది. యాంకర్ గా అనసూయ ఎప్పుడు తన హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

 

పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా సరే గ్లామర్ షో విషయంలో రాజీ పడదు అనసూయ. జబర్దస్త్ షోలో వాళ్ళు వేసే స్కిట్స్ తో పాటుగా అనసూయ చేసే హాట్ షోకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు తొడలు కనిపించే డ్రెస్సులతో కనిపించే అనసూయ ఫస్ట్ టైం నిండా బట్టలు వేసుకుని కన్పించింది. పద్ధతిగా పట్టు హాఫ్ సారీతో గురువారం ఎపిసోడ్ లో అనసూయ అదరగొట్టింది. అమ్మడి అన్ని కప్పుకున్నా సరే ఆ సెక్సీ అప్పీల్ మాత్రం మిస్ అవలేదు.

 

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ హాట్ యాంకర్ అనసూయ గురువారం జరిగిన ఎపిసోడ్ లో ఆపద్బాంధవుడు సినిమాలో ఆవురా అమ్మకుచ్చెళ్ల అన్న సాంగ్ కు డ్యాన్స్ వేస్తూ ఎంటర్ అయ్యింది. హాఫ్ సారీలోనే కనిపించిన అనసూయ చూపరులను ఆకట్టుకుంది. ఎప్పుడూ స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయే అనసూయ ఈ కొత్త అవతారం కూడా సూపర్ అనిపించింది. అనసూయ అప్పుడప్పుడు ఇలా నిండు బట్టల్లో కనిపిస్తే బాగుటుందని అందరు కోరుకుంటున్నారు.

 

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అనసూయ టివి హోస్ట్ గానే కాదు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తుంది. క్షణం నుండి అనసూయ చేస్తున్న ప్రతి సినిమా కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు రెండు మెగా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు వెండితెర మీద కూడా తన అందంతో ఆకట్టుకోవాలని చూస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: