టాలీవుడ్ లో అందమైన, చలాకీ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. అటు బుల్లి తెర మీదే కాకుండా ఇటు... వెండి తెర మీద కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో ఆమెను కీలక పాత్రల కోసం దర్శక నిర్మాతలు సంప్రదిస్తూ ఉంటారు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో ఆమె చేసిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే రెండు మూడు సినిమాల్లో ఆమె కనిపించి మెప్పించింది. 

 

ఇప్పుడు ఆమెను వరుస ఆఫర్లు సినిమాల్లో పలకరిస్తున్నాయి అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రల కోసం ఆమె పేరుని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె పేరు ప్రస్తావనకు వస్తుంది. ఇక యాంకర్ గా ఆమె కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజి లో ఉంది. గ్లామర్ ని కూడా చూపిస్తూ ఆమె చెలరేగిపోతుంది. అయితే ఇక్కడ ఆమె భర్త గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె స్కిన్ షో చేసినా సరే ఆమె భర్త నుంచి ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తూ ఉంటారు. 

 

ఆమెను అన్ని విధాలుగా ప్రోత్సహించడం తో పాటుగా నిన్ను ప్రేక్షకులు ఏ విధంగా ఇష్టపడతారో ఆ విధంగానే ఉండు అంటూ అతను ప్రోత్సహిస్తాడని అంటున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే అనసూయ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. వరుస ఆఫర్లు ఆమె కెరీర్ ని ఒక రేంజ్ లో ఉంచాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుత౦ టాలీవుడ్ లో అనసూయ కు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంకా సుమా హవా ఉన్న నేపధ్యంలో ఈమె గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: