రేష్మీ గౌతం... జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్. ఆ షో లో ఆమె మాట్లాడే మాటలు, అందులో ఉండే నటులతో ఆమె సంభాషణలు ఇలా అన్నీ కూడా ఆమెను జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాయి అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఇంత తక్కువ కాలంలో అంత పాపులర్ అయిన యాంకర్ మరొకరు లేరు అనేది అందరికి తెలిసిందే. ఆమెకు ఇప్పుడు డిమాండ్ ఉన్నా సరే గ్లామర్ షో చేసే టీవీ షోస్ కి మాత్రమే ఆమెను సంప్రదిస్తున్నారు. ఇక పోటీ ఎక్కువగా ఉండటం యువ యాంకర్లు ఎక్కువగా రావడంతో ఆమె గురించి పెద్దగా ఆలోచించడం లేదు నిర్మాతలు. 

 

కాని జబర్దస్త్ లో మాత్రం ఆమె ఎవర్ గ్రీన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక ఇది పక్కన పెడితే ఆమె సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా అవకాశాలు మాత్రం ఆమెకు పెద్దగా రావడం లేదు. టాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అనుకున్నారు గ్లామర్ చూసి. కాని ఆమె కెరీర్ మాత్రం ఆ విషయంలో దూకుడుగా ముందుకి వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు. ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో పెద్దగా దర్శక నిర్మాతలు ఆమె గురించి ఆలోచించడం లేదు. 

 

అయినా సరే ఆమె హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ మధ్య ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే అక్కడ రెమ్యునరేషన్ తక్కువ అనడంతో ఆమె వెనక్కు తగ్గినట్టు సమాచారం. మరికొన్ని సినిమాల్లో ఆమె ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. మరి అవి ఎంతగా ఫలిస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా ఆమె యాంకర్ గా మాత్రం మరికొంత కాలం రాణించే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: