ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో  ఎవర్గ్రీన్ యాంకర్ గా నిలిచిన వ్యక్తి సుమ. బుల్లి తెర పై తమదైన వాక్చాతుర్యంతో ఓవైపు అందం తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది సుమా. సుమ బుల్లి తెరపై సందడి చేస్తుంది ఇప్పటినుంచి కాదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి బుల్లితెరపై సుమ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పటివరకు సుమ ఎన్నో విజయవంతమైన షోలలో  యాంకరింగ్ చేసి తెలుగు బుల్లితెర నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది. 

 

 

 కేవలం బుల్లితెర పైనే కాదు ఏ సినిమా ఈవెంట్ లో చూసిన సుమా నే  కనిపిస్తూ ఉంటుంది. సుమ ఏదైన ఈవెంట్లో యాంకరింగ్ చేస్తోంది అంటే ఇక ఆ ఈవెంట్ హిట్  అయిపోయినట్లే అని అనుకుంటూ ఉంటారు చిత్ర దర్శక నిర్మాతలు. అందుకే తమ తమ సినిమా ఈవెంట్ల  కోసం ఎక్కువగా సుమ వైపే మొగ్గు చూపుతుంటారు. ఓవైపు బుల్లితెరపై వివిధ ప్రోగ్రాముల తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తునే...  మరోవైపు సినిమాల  లో కూడా తనదైన వాక్చాతుర్యంతో అందరినీ అలరిస్తోంది. అయితే ప్రస్తుతం సుమా టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్  గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో సుమ కి  పోటీ ఇచ్చే  యాంకర్ ఎవరు లేరు అనే చెప్పాలి. అయితే యాంకర్ సుమ ఇప్పుడు వరకు చాలానే ప్రోగ్రాం లు  చేసింది. 

 

 

 కానీ యాంకర్ సుమ ను తెరమీదకు తీసుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చిన ప్రోగ్రాం మాత్రం అవాక్కయ్యారా. ఈ ప్రోగ్రాంలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సుమ. ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఆకర్షించింది. ఈ ప్రోగ్రామ్ సుమకి  ఎంతోగానో గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోగ్రాం తర్వాత వచ్చిన పట్టుకుంటే పట్టుచీర, స్టార్ మహిళ ప్రోగ్రాం ల ద్వారా సుమా క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత సుమకి  అభిమానులు కూడా బాగా పెరిగిపోయారు. ఇక ఆ తర్వాత సుమ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: