ఒకవైపు వరసగా సినిమాలు చేస్తూ మరొకవైపు రాజకీయాలు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ నిన్న సినిమా షూటింగ్ నుండి నేరుగా విజయవాడ వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి స్థానికి సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసారు. పవన్ప్రెస్ మీట్ లో చాల ఫ్రెష్ గా కనిపించాలని ఎంత ప్రయత్నించినా పవన్ ముఖంలో గ్లో తక్కువగా ఉంది అన్న స్పష్టమైన కామెంట్స్ నిన్నటి మీడియా మీట్ లో వినిపించాయి. 


దీనితో వందల కోట్ల బడ్జెట్ తో వరస పెట్టి పవన్ తో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతల పరిస్థితి ఏమిటి అంటూ ప్రస్తుతం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాలు అన్నీ ఇప్పటికే దర్శకుడు క్రిష్ దృష్టి వరకు వచ్చినట్లు ఉన్నాయి. 


అందుకే పవన్ శరీరంలో బరువును తగ్గించి అతడి ముఖంలో గ్లో ను పెంచడానికి క్రిష్ ముంబాయి నుండి ఒక ప్రముఖ డైటీషియన్ ను పిలిపించి అతడి ఆద్వర్యంలో పవన్ డైటింగ్ ప్రోగ్రామ్ ను క్రిష్ డిజైన్ చేయించినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ లుక్ లో మార్పు తీసుకు వచ్చి అతడి శరీర బరువును కనీసం 25 కేజీలు తగ్గించడానికి క్రిష్ ఆ డైటీషియన్ సలహాలతో పూర్తిగా లిక్వీడ్ డైట్ పై ఉంచుతూ పవన్ కు వెయిట్ లాస్ కార్యక్రమాలను చాల వేగంగా అమలు పరచడానికి ప్రయత్నాలుకొనసాగుతున్నాయి. 


ప్రస్తుతం క్రిష్ పవన్ తో తీస్తున్న మూవీలో యాక్షన్ సీన్స్ ప్రముఖ హాలీవుడ్ మూవీలు ‘ఎవెంజర్స్’ ‘మార్వేల్’ హాలీవుడ్ మూవీల స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉంటాయి కాబట్టి పవన్ కు బరువు తగ్గే విషయంలో క్రిష్ టార్గెట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ ప్రస్తుతం లిక్విడ్ డైట్ పై కొనసాగుతున్నప్పటికీ తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం జనంలోకి చాల విస్తృతంగా రాబోతున్న పరిస్థితులలో పవన్ వెయిట్ లాస్ కార్యక్రమం ఏమౌతుంది అంటూ క్రిష్ తల పట్టుకుంటున్నట్లు సమాచారం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: