టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. సుమాతో పోటీ గా ఆమె యాంకరింగ్ చేసే వారు. కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా మారి ప్రముఖ టీవీ షోస్ కి యాంకర్ గా పని చేసారు. సినిమా కార్యక్రమాలకు కూడా ఆమె యాంకర్ గా వ్యవహరించారు. స్టార్ హీరోల సినిమాలతో పాటుగా ఎవరిని అయినా ఇంటర్వ్యులు చెయ్యాలన్నా సరే ఝాన్సీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారు. ఆమె పలు టీవీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహించారు. 

 

అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె కెరీర్ ఇబ్బంది పడుతుంది. యాంకర్ గా ఆమె ఎప్పుడో మినహా కనపడటం లేదు. సుమాకి ఒకప్పుడు పోటీ గా ఉండే ఝాన్సి ఇప్పుడు షోస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె భారీగా డిమాండ్ చేయడమే అంటున్నారు. అటు తమిళం కన్నడం లో కూడా వరుస ఆఫర్లు రావడంతో ఆమె రేటు భారీగా పెంచేసారని ఇది నిర్మాతలకు ఇబ్బందికరంగా మారిందని, అందుకే ఆమెను టాలీవుడ్ వద్దు అని చెప్పిందని పలువురు అంటున్నారు. 

 

ఆమెకు అవకాశాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళే ఇప్పుడు డ్రాప్ అయిపోయారట. ప్రస్తుతం ఆమె తమిళంలో బిజీ గా ఉన్నారు. అక్కడ ప్రముఖ టీవీ షోస్ కి యాంకర్ గా కూడా చేస్తున్నారు. దీనితో తెలుగుని కూడా ఆమె లైట్ తీసుకున్నారు. బతుకు జట్కా బండి లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసినా ఆమెను వద్దని చెప్పారని అందుకే ఆమె కూడా తెలుగుని లైట్ తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. దీనితో యాంకరింగ్ మీద కూడా ఆమె దృష్టి తగ్గించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: