టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉంటే యాంకర్స్ లో సునీత ఒకరు. పలు కీలక టీవీ షోస్ కి ఆమె మాత్రమే యాంకర్ గా చేయగలదు అనే రేంజ్ లో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్ గా వేల పాటలను పాడారు సునీత. బాలీవుడ్ దర్శకులు కూడా ఆమె కోసం ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తమిళంలో కూడా ఆమె తో పాటలు పాడించే ప్రయత్నం చేసారు అక్కడి అగ్ర దర్శకులు. అయినా సరే సునీత ఎక్కువగా తెలుగు మీదే దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగులో ఆమె టాప్ సింగర్స్ లో ఒకరిగా ఉన్నారు. 

 

పాప్ సింగర్ గా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమెకు యాంకర్ గా కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతర్వ్యులు చేయడంతో పాటుగా పలు టీవీ షోస్ కి ఆమె యాంకర్ గా పని చేసారు. టీవీ షో లో ఆమె యాంకరింగ్ వస్తుంది అంటే చాలా మంది ఆమె అందం కోసమే ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ఆమె నవ్వుకి ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమె టీవీ షో చేస్తాను అంటే భారీగా ఇవ్వడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు నిర్మాతలు. అలా తెలుగులో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 

 

ఆమె పారితోషికం ఎక్కువగా ఉన్నా సరే దర్శక నిర్మాతలు ఆమెనే కావాలని పట్టుదలగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె డిమాండ్ ఉన్న సింగర్ కూడా. ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీగా అభిమానులు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆమె మాత్రం కెరీర్ లో ఇబ్బంది పడలేదు. అగ్ర సంగీత దర్శకులకు ఆమె ఫేవరేట్ సింగర్. సునీత అడపా దడపా టీవీ షోస్ చేసినా చాలు అనుకుంటారు. యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: