టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్స్ లో లాస్య ఒకరు. అగ్ర దర్శకులతో ఇంటర్వ్యు లు కూడా చేసింది. సౌందర్య లహరి అనే ఈటీవి షో లో ఆమె దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ని ఇంటర్వ్యు చేసారు. ఆ షో లో ఆమె చాలా చలాకీగా కనిపించారు. దీనితో ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రముఖ టీవీ చానల్స్ అన్ని కూడా ఆమెతో షోస్ చేయడానికి ముందుకి వచ్చాయి. ఆమె హడావుడి చూసి చాలా మంది స్టార్ యాంకర్ అవుతారని భావించారు. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఉన్నపళంగా ఆమె కెరీర్ ఇబ్బంది పడటం మొదలయింది. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె పేరు ఎక్కడా వినపడటం లేదు కూడా. దీనికి కారణం ఒక మేల్ యాంకర్ అని అంటూ ఉంటారు. ఆమె యాంకర్ గా రాణిస్తున్న సమయంలో ఆ యాంకర్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం కెరీర్ ని ఇబ్బంది పెట్టింది అంటూ ఉంటారు. ఆమెకు చాలా మంది అతనితో సాన్నిహిత్యం వద్దని చెప్పినా సరే ఆమె వెనక్కు తగ్గలేదని, ఫలితంగా కుటుంబంలో కూడా ఇబ్బందులు పడింది అంటూ ఉంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పూర్తిగా యాంకరింగ్ కి దూరమైంది. ఎప్పుడో మినహా ఆమె కనపడలేదు యాంకర్ గా. 

 

మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఆమె వినియోగించుకోలేదు. అప్పట్లో ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఆమెను పెట్టి ఒక రియాలిటి షో కూడా చెయ్యాలని జెమిని భావించింది. అయినా సరే ఆమె మాత్రం కొన్ని కొన్ని స్నేహాలతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ఒకవేళ ఆమె ఉండి ఉంటే మాత్రం టాలీవుడ్ లో మంచి యాంకర్ అయ్యే వారని ఆమె అభిమానులు ఇప్పటికి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: