ప్రస్తుతం బుల్లితెరపై వెండితెర పై తనకు తిరుగు లేదు అని నిరూపించుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది యాంకర్ అనసూయ. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అందాల ఆరబోతలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్ డాల్ గా మారిపోయింది అనసూయ. సాంప్రదాయమైన కట్టుబొట్టు లో కనిపించి తనదైన యాంకరింగ్ తో అదరగొట్టాలి  అన్న.. పొట్టి పొట్టి డ్రెస్సులతో బుల్లితెర ప్రేక్షకులందరికీ పిచ్చెక్కిస్తు  తన వాక్చాతుర్యంతో అందరిని మెస్మరైజ్  చేయాలి అన్న అది యాంకర్ అనసూయకు మాత్రమే సాధ్యం అని చెప్పాలి. 

 

 ప్రస్తుతం బుల్లితెర పై పలు ప్రోగ్రాములు యాంకరింగ్ చేస్తూనే  మరోవైపు వెండితెరపై కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు జబర్దస్త్ ప్రోగ్రాం లో ప్రతీ వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ తన వాక్చాతుర్యంతో అలాటిస్తూనే  మరోవైపు జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్ అనే షోలో కూడా తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొడుతోంది. రోజురోజుకు ప్రేక్షకులకు ఫేవరెట్ యాంకర్ గా మారిపోతుంది అనసూయ. అనసూయ అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జబర్దస్త్ షోలో యాంకరింగ్ ఛాన్స్ కొట్టేసి నక్కతోక తొక్కిన అనసూయ ఆ తర్వాత వరుస అవకాశాలతో అందిపుచ్చుకుంది. 

 

 అటు వెండి తెరపై కూడా పలు సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకు తిరుగులేదని నిరూపించుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో బుల్లితెరపై అనసూయకు  సంబంధించి ఓ ఆసక్తికర జరిగింది. అనసూయ ఛాతిపై నిక్కు  అని ఒక టాటూ ఉంటుంది. ఓ రోజు సోషల్ మీడియాలో అభిమానులతో అనసూయ చిట్ చాట్ చేస్తున్న సమయంలో టాటూ  గురించి అభిమానులు ప్రశ్నించగా అసలు విషయం బయట పెట్టింది అనసూయ. టాటూ అర్థం నిక్కు అని... నిక్కు  అంటే తన భర్తను ముద్దుగా పిలుచుకునే పేరు అంటూ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: