తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ గురించి తెలియని వారు ఉండరు.  సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు విజయదళపతి.   మెర్సల్, సర్కార్ చిత్రంలో విజయ్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది.  ఈ చిత్రాల్లో విజయ్ ప్రభుత్వాలను విమర్శించే డైలాగ్స్ ఉండటంతో అప్పుట్లో ఈ మూవీస్ పై వేటు వేయాలని చూశారు.. మొత్తానికి రిలీజ్ సూపర్ హిట్ కావడం.. బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురవడం జరిగింది.  గత కొన్ని రోజుల క్రితం విజయ్ ఇల్లు, ఆఫీస్ లో ఐటీ శాఖ వారు రైడ్ చేసిన విషయం తెలిసిందే. 

 

విజయ్ మూవీ రిలీజ్ అవుతుందీ అంటే.. భారీ కలెక్షన్లు గ్యారెంటి. దీనికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు విజయ్‌. బిగిల్‌ చిత్రానికి 50 కోట్లు తీసుకుంటే... మాస్టర్‌కు 80 కోట్ల రూపాయలు వసూలు చేశాడని టాక్. ఈ క్రమంగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కడుతున్నాడా? లేదా? అన్నది చాలా మంది సందేహం.  ఐటీ అధికారులకు కూడా అదే డౌటొచ్చింది. దీంతో ఇటీవల కాలంలో ఆయన ఇంటిపై పలు సార్లు దాడులు చేశారు అధికారులు.  బిగిల్‌ సినిమాకు సంబంధించి ట్యాక్స్‌ ఎగవేత ఆరోపణలతో గత నెలలో విజయ్‌ ఇంట్లో సోదాలు చేశారు.

 

ఏజీఎస్ సంస్థలోనూ తనిఖీలు నిర్వహించారు. అంతే కాదు ఏకంగా షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ ప్రశ్నల వర్షం కురిపించారు.  తాజాగా, మరో సారి సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. చెన్నైలోని విజయ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. దీంతో  ఏం జరుగుతుందో ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.  అయితే తాము అడిగిన పత్రాలు అన్నీ చూపించారని.. పన్ను చెల్లింపులో అతను పర్ఫెక్ట్‌ అని తేల్చేశారు.  దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నాడు.. తమ హీరో రీల్ లైప్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: