ప్రస్తుతం బుల్లితెర యాంకర్ లలో  మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది యాంకర్ రష్మి. ఈ అమ్మడికి సరిగ్గా తెలుగు మాట్లాడడం రాకపోయినా జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించింది. ఇక జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం అనే పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తల కారణంగా ఈ అమ్మడికి మరింత గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం వెండితెరపై పలు అవకాశాలు అందుకుంటూనే బుల్లితెరపై కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అందాల ఆరబోత విషయంలో కూడా అస్సలు వెనుకడుగు వేయదు . తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది రష్మీ . ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ అదరగొడుతున్న ఈ అమ్మడు ... మరోవైపు ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో టీమ్ లీడర్గా చేస్తూ తెలుగు ప్రేక్షకులు అందరినీ అలరిస్తోంది. 

 

 

 అయితే అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని రష్మి గౌతమ్ జబర్దస్త్ లో చేసిన తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలుగా  మారిపోయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా రష్మీ ఎంతగానో ఇమేజ్ సంపాదించినది  అని చెప్పొచ్చు. అయితే మొదట సినిమా ఇండస్ట్రీ కి రావాలని కుటుంబాన్ని వదిలి వచ్చేసిన రష్మి గౌతమ్... అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ఇక రష్మి గౌతమ్ కు మొదట ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ గా ఉంటుంది. ఇక ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాల్లో నటించినా రష్మి గౌతమ్ తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. 

 

 

 హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్లో  ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చింది రష్మి గౌతమ్. అయితే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి యాంకర్ గా ఉన్న అనసూయ జబర్దస్త్ నుంచి వివిధ కారణాల వల్ల తప్పుకోవడంతో.. అప్పటి వరకు ఉన్న యాంకర్లు కాకుండా సరికొత్త యాంకర్ ని తీసుకు వస్తే బాగుంటుందని భావించి జబర్దస్త్ నిర్వాహకులు రష్మికి అవకాశం ఇచ్చారు. ఇక మొదట తెలుగు రాక కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత మాత్రం పుంజుకుని  తన వాక్చాతుర్యంతో అందరిని ఆకర్షించింది రష్మీ . ఇక జబర్దస్త్ తర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాలో మరోసారి తన గ్లామర్తో అందరికీ చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఏదేమైనా రష్మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ మాత్రం జబర్దస్త్ షో అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: