మరో రెండు వారాలలో రాబోతున్న ఉగాది పండుగ సినిమాల హడావిడి ఎంతవరకు ఉంటుందో కరోనా ప్రభావం వల్ల చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఈ ఉగాది పండుగకు నాని ‘వి’ విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. 


దీనితో కేవలం చిన్న సినిమాల హడావిడి మాత్రమే ఉగాది పండుగ రోజున కనిపించే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ లోటును తీర్చడానికి మెగా ఫ్యామిలీ మరొక విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ ప్రకటన లేకపోయినా కనీసం చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్.


ఇది ఇలా ఉండగా ఉగాది పండుగ రోజున చిరంజీవి కొరటాల మూవీ ‘ఆచార్య’ టైటిల్ ప్రకటనతో పాటు చిరంజీవి లుక్ ను కూడ విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా పవన్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ కు సంబంధించి టీజర్ ను విడుదల చేయడమే కాకుండా ఆ టీజర్ లో కోర్ట్ సీన్ లో పవన్ చెప్పే డైలాగ్ లు కూడ ఉంటాయి అని అంటున్నారు. 


దీనితో ఉగాది పండుగ హడావిడి అంతా పవన్ మెగా ఫ్యామిలీ హీరోల సందడితో కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. కరోనా వార్తల భయాలతో హోరెత్తిపోతున్న వార్తల హంగామా మధ్య కొద్దిగా అయినా మెగా ఫ్యామిలీ హీరోలు ఉగాది సరదాలను తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు అందించే ఆస్కారం ఉంది అనుకోవాలి. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాల ఊసు కూడ లేకుండా ఉండటంతో ధియేటర్లు అన్నీ బోసిపోతు ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్న నేపధ్యంలో ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియని అయోమయ పరిస్థితులలో ఇండస్ట్రీ వర్గాలు ప్రస్తుతం కొనసాగుతు ఉన్నాయి అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: