పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ మ‌రియు కోనా ఫిలిమ్స్ కొర్పొరేష‌న్స్ సంయుక్తంగా క‌లిసి నిర్మిస్తున్న చిత్రం నిశ‌బ్దం. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల‌కాబోతుంది. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే. అనుష్క ఎన్నో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. అంతేకాక లేడీ ఓరియంటెడ్ పాత్ర‌ల‌కి ప్రాణం పోసింది అనుష్క అని చెప్పాలి. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి ఇలా ర‌క ర‌కాల విభిన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ కెరియ‌ర్‌ని ముందుకు తీసుకువెళుతూ టాప్‌రేంజ్‌లో ఉంది అనుష్క‌. ఈ మ‌ధ్య కాస్త గ్యాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ నిశ‌బ్ధం చిత్రంతో సైలెంట్‌గా మ‌ళ్ళీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మ‌ళ్ళీ హైలెట్‌గా నిల‌వాల‌నుకుంటోంది. ఇక నిన్న‌టితో త‌న సినీ కెరియ‌ర్ మొద‌లై 15ఏళ్ళు పూర్త‌వ‌గా ఇండ‌స్ట్రీలోని ఎంతో మంది అగ్ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఈవెంట్‌కి హాజ‌రై స్వీటీతో త‌మ‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా...

 

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మాట్లాడుతూ... స్వీటీ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. స్వీటీకి చాలా అబ్‌జ‌ర్వేష‌న్ ఎక్కువ అంటే ప్ర‌తీ విష‌యాన్ఇన ఎక్కువ‌గా గ‌మ‌నిస్త‌ది. ఇంత పెద్ద ఫంక్ష‌న్‌లో కూడా ఎక్క‌డ లైట్లు ప‌నిచేస్తున్నాయి. ఎక్క‌డ ఎవ‌రి ఫేసుల్లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఎలా ఉన్నాయి. ఇలా మొత్తం చెప్ప‌గ‌ల స‌త్తా ఉన్న అమ్మాయి. విక్ర‌మార్కుడు సినిమా చేసినప్పుడు స్వీటీతో నాకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటే ప్ర‌తి షాట్‌ని చేసి చూపించ‌మ‌నేది. ప్ర‌తి షాట్ అలానే చేసి చూపిస్తే త‌ను చూసి త‌న‌కు త‌ను మాడిఫై చేసుకుని చేసేది. సీన్స్ అంటే చేసేవాడిని కాక‌పోతే ర‌వితేజ‌తో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించ‌మ‌నేది. బాడీ పోస్ట‌ర్‌తో స‌హానాతో అన్నీ చేయించింది. విక్ర‌మార్కుడు టైమ్‌లోనే త‌ను మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది. నార్మ‌ల్‌గా నా మూవీస్‌లో చాలా హీరోస్‌కి త‌ప్పించి హీరోయ‌న్ల‌కి ప్ర‌త్యేకించి పాత్ర‌ల‌నైతే పుట్టించ‌ను. ఇక చాలా మంది హీరోయ‌న్స్‌తో ప‌ని చేస్తాం. కొంత మందిని ప్రేమిస్తాం. మ‌రికొంత మందిని ఇష్ట‌ప‌డ‌తాం. కానీ స్వీటీని మాత్రం ఒక యాక్ట‌ర్‌గా, అలాగే ఒక మంచి మ‌న‌సున్న మ‌నిషిగా నేను ఎంతో గౌర‌విస్తాను. నేన‌న్నా చాలా గౌర‌వం. ఇక త‌నంనే నా మ‌న‌సులో త‌న‌కు ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. స్వీటీ నువు ఎంచుకునే రోల్స్ అన్నీ చాలా బావున్నాయి. అలాగే ఎంతో మంచి మ‌రిన్ని పాత్ర‌ల్లో న‌టించాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: