ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు మినిమం రూ.100 కోట్లు దాటుతున్న విషయం తెలిసందే. సక్సెస్ అయితే అంతకు అంత డబుల్ వసూళ్లు చేస్తున్నాయి.. ఫల్టీ కొడితే మాత్రం బైండ్ బ్లాక్ అయ్యేలా నష్టాలు వస్తున్నాయి. కానీ నిర్మాతలు ఈ విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు.. పెద్ద హీరోల సినిమాలంటే ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. భారీ బడ్జెట్ పెట్టడానికే రెడీ అవుతున్నారు.  ఆ మద్య వచ్చిన రోబో 2.0 రూ.400 కోట్లు, సైరా నరసింహారెడ్డి రూ.300 కోట్లు, ప్రభాస్ నటించిన సాహెూ మూవీకి రూ.350 కోట్లు ఇలా భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించారు.. కానీ సరైన ఫలితాన్ని మాత్రం పొందలేక పోయారు. మొన్నటి వరకు ఏపి రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు వెండితెరపై మరోసారి తన సత్తా చాటబోతున్నారు.  

 


బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'వకీల్ సాబ్' టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, పవన్ చేయనున్న తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొఘల్ చక్రవర్తుల పాలనా కాలంలో ఈ కథ నడుస్తుంది. 

 


అందువలన ఆ కాలం నాటి సెట్స్ ను భారీగా వేస్తున్నారు. ఇందుకోసం నిర్మాత ఎ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ ను కేటాయించాడట.  ఆ కాలం నాటి పరిస్థితులను కన్నులకు కట్టినట్ట చూపించేందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. పవన్ కెరియర్లో ఇది తొలి చారిత్రక మూవీ.. ఆయన కెరియర్లో తొలి భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదేనని అంటున్నారు.  ఈ మూవీలో పవన్ కళ్యాన్ ఓ గజదొంగ గా కనిపించబోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: