టాలీవుడ్ లో, తెలుగు బుల్లి తెర మీద అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్స్ లో శ్రీ ముఖి ఒకరు. ఆమె చేసే షోస్ లో ఆమె హుషారు చూసి ఎందరో ఆమెను అభినందించారు. కొంత మంది అయితే కాస్త పాపకు హైప్ ఇచ్చారు. ఆమెను ఇంట్లో అమ్మాయి అన్నట్టు మాట్లాడారు. చాలా టీవీ షోస్ కి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖ చానల్స్ లో వచ్చే కార్యక్రమాలకు ఆమె యాంకర్ గా వ్యవహరించి అలరించారు. ఆమె చేసిన షోస్ అన్నీ కూడా సూపర్ హిట్ అయి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాయి అనేది వాస్తవం. 

 

అయితే కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు ఆమె చేసిన కొన్ని పనులు కెరీర్ ని ఇబ్బంది పెట్టాయి. ఆమె కొన్ని కొన్ని విషయాల్లో అనవసరంగా తల దూర్చడం తో పాటుగా టీవీ షోస్ సమయంలో చేసే అతి కూడా ఇబ్బంది పెట్టింది. ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తుంది అని, అది కొంత వరకు ఉంటే పర్వాలేదు గాని అన్ని సమయాల్లో అది పనికి రాదు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఆమెపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ ఫాలోయింగ్ ని ఆమె నాశనం చేసుకుంది. 

 

ఈ మధ్య పాప కాస్త స్కిన్ షో కూడా చేస్తూ వస్తుంది. సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోయాయి. ఇక బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు కెరీర్ లో ఆమె నిలబడే ప్రయత్నం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: