బాలీవుడ్‌ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రస్తుతం సినీ కెరీర్‌ పరంగానే కాదు పర్సనల్‌ లైఫ్‌ లోనూ వెల్‌ సెటిల్‌ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్‌ సింగ్‌ ను పెళ్లాడిన ఈ భామ, మ్యారిడ్‌ లైఫ్‌ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే గతంలో ఈ భామ తన రిలేషన్‌ షిప్స్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ రిలేషన్‌ షిప్స్‌ కారణంగా ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల అభిమానులతో పంచుకుంది.

 

ఈ సందర్భంగా తాను ఎమోషనల్‌ పర్సన్‌ అన్న దీపికా సెక్స్‌ కేవలం సుఖం కోసం మాత్రమే చేయను అని చెప్పింది. `నాకు సంబంధించినంత వరకు సెక్స్‌ అనేది కేవలం శారీరక అంశం కాదు. అందులో ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. నేను రిలేషన్‌ షిప్‌లో ఉన్న సమయంలో ఎవరినీ చీట్ చేయలేదు. ఒక వేళ చీట్ చేయల్సిన అవసరం వస్తే ఇక రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్టుగా కాదు కదా? అలా చేయటం కన్నా ఒంటరిగా ఉండటం బెటర్‌` అంటోంది దీపికా.

 

`రిలేషన్‌ షిక్‌లో నన్ను మోసం చేసిన వారు కూడా ఉన్నారు. నేను చాలా ఫూలిష్‌గా అతనికి రెండో ఛాన్స్‌ కూడా ఇచ్చాను. అతను ప్రదేయ పడటంతో అతనికి ఆ చాన్స్ ఇచ్చాను. నిజానికి అతను నన్ను మోసం చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. దీంతో నేను ఆ సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఒక్కసారి బయటకు వచ్చిన తరువాత తిరిగి అలాంటి తప్పు చేయలేదు` అంటూ క్లారిటీ ఇచ్చింది దీపికా. అయితే తాను ఎవరి గురించి చెపుతున్న విషయం దీపిక బయట పెట్టకపోయినా, ఆమె  రణబీర్‌ కపూర్‌ ను ఉద్దేశించే ఈ కామెంట్లు చేసినట్టుగా భావిస్తున్నారు బాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: