అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే పోలీస్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎన్ ఐ ఏ అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకి ముందే ఓకే అనుకున్న బంగార్రాజు ఇంతవరకు పట్టాలెక్కలేదు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున అది పూర్తికాగానే బంగార్రాజు  షూటింగ్లో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా వైల్డ్ డాగ్ చిత్రంలో నటిస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వర్షాకాలం ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

 

బంగార్రాజు చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఎలాగైనా సీక్వెల్ ప్లాన్ చేద్దామని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు కథని రాసుకున్నాడు. అయితే ఈ కథని నాగార్జునకి వినిపించినప్పటికీ ఎక్కడో ఏదో తప్పులు దొర్లడంతో ఇంకా పట్టాలెక్కట్లేదు. అయితే స్క్రిప్ట్ పరంగా నాగార్జున నచ్చే విధంగా తీర్చి దిద్దడం కోసం కళ్యాణ్ కృష్ణ మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు.

 

 

 


అయినా కూడా నాగార్జున ఓకే చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒక దశలో బంగార్రాజు చిత్రం ఉంటుందా ఉండదా అనే సందేహం కూడా కలిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. బంగార్రాజు సినిమా  మరి కొద్దీ రోజుల్లో చిత్రీకరణ జరుపుకోనుందట. జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసుకుని డిసెంబరు వరకు రిలిజ్ చేయాలని భావిస్తున్నారట.

 

 

 


అయితే సంక్రాంతి బరిలో దిగుదామనే ఆలోచనలు కూడా ఉన్నప్పటికీ, అప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రం రిలీజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో తమ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదేతేనేం బంగార్రాజు చిత్రాన్ని మనం చూడబోతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: