సాధారణంగా తెలుగు సీరియళ్లు అనగానే అత్తా కోడళ్ల కొట్లాటలు, వదిన మరదళ్ల ఎత్తు పొడుపు  మాటలు, చిన్న వాటికే కక్ష్యలు పెంచుకునే మనుషులు కనిపిస్తారు. మన సీరియళ్లు మనుషుల మధ్య ద్వేషం పుట్టించే విధంగా ఎందుకు ఉంటాయో అర్థం కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారుతొంది. సాగదీతలు, ఏడిపించాడాలు తక్కువయ్యాయి. కానీ ఒక్కప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. 

 

అయితే ప్రేక్షకులు కూడా అలాంటి వాటినే ఎంకరేజ్ చేసేవారు కాబట్టి సీరియళ్ళన్నీ అలాగే వస్తుండేవి. అలాంటి టైం లో వాటన్నింటికి భిన్నంగా కేవలం నవ్వించడానికి మాత్రమే ఒక సీరియల్ వచ్చేది. వారానికి అరగంట పాటు వచ్చే ఈ  సీరియల్ కోసం ఎంతో మంది వెయిట్ చేసేవారు. వారమంతా ఊకదంపుడు సీరియళ్లు చూసినా ఆ ఒక్క రోజు మాత్రం హాయిగా నవ్వుకునే వారు. ఇంతకీ ఆ సీరియల్ ఎంటో  మీకీ పాటికే అర్థమై ఉంటుంది. అదేనండి అమృతం.

 


అవును అమృతం దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగింది. గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ యెల్లో బ్యానర్ లో నిర్మించిన ఈ సీరియల్ కి ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సీరియల్ గా బంద్ అయ్యాక ప్రేక్షకుల కోసం యూట్యూబ్ లో విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది ఈ సీరియల్. అందుకే ఇప్పుడు ఈ సీరియల్ కి సీక్వెల్ వచ్చేస్తోంది.

 

అమృతం ద్వితీయం పేరుతో జీ౫ లో వెబ్ సిరీస్ రూపంలో మనల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయింది. ఈ సీరియల్ పై రాజమౌళి కూడా కామెంట్ చేయడం విశేషం. ఈ అమృతం ద్వితీయం ఈ ఉగాది నుండి జీ౫ లో ప్రీమియర్ అవనుంది. మరి అప్పటి లాగే ఇప్పుడు కూడా పాత్రల మూర్ఖత్వంతో మనల్ని నవ్విస్తారో లేదో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: