ప్రభాస్  ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ ప్రభాస్ తో సినిమా చేద్దామని లైన్లో ఉన్న ఛాలా మంది స్టార్ డైరెక్టర్లను కాదని కామ్ గా మహానటి డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అసలు నాగాశ్విన్-ప్రభాస్ కాంబినేషన్లో సినిమా అన్న ఊహే క్రేజీగా ఉందంటున్నారు ఫ్యాన్స్ . టాలీవుడ్ లో పెద్ద ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

 

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబందించి ఇంట్రస్టింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. ప్రస్తుతం  ప్రభాస్ రాధాకృష్న కాంబినేషన్ లో పూజాహెగ్డే జంటగా జాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జాన్ కంప్లీట్ అయ్యాక నాగాశ్విన్ సినిమా మీద ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేస్తానని చెప్పాడు ప్రభాస్. ఆల్రెడీ ఈ సంవత్సరం ఎండ్ కి ఈ ప్యాన్ వరల్డ్ సినిమా స్టార్ట్ అవుతోంది. 

 

ప్యాన్ వరల్డ్  సినిమా.. అసలు ఆ సౌండింగే సూపర్ గా అనిపిస్తోంది. ప్యాన్ ఇండియా సినిమాలకే 200 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మరిప్యాన్ వరల్డ్ అంటే బడ్జెట్ ఏ రేంజ్ లో ఉండాలి..? అందుకే దాదాపు 400 కోట్ల బడ్జెట్ కి పైగా  ప్రభాస్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్  కూడా భారీగానే ఉండబోతోందని ఇప్పటికే టాక్ . 

 

మరి ఈ వరల్డ్  వైడ్ సినిమాకి ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా.. ? పర్లేదు అనిపించుకున్న సాహో సినిమాకే 100 కోట్లకుపైగా తీసుకున్నాడు ప్రభాస్. ఇక ప్రైడ్ మూవీ బాహుబలికి 200కోట్లకు పైనే దక్కించుకున్నాడని టాక్. మరి ఈ ప్యాన్ వరల్డ్ సినమాకి మినిమం 70 కోట్లతో మొదలుపెడుతున్నాడు  రెబల్ స్టార్ .సినిమా తెరకెక్కిన తర్వాత హైప్స్ ని బట్టి రిలీజ్ తర్వాత కలెక్షన్లను బట్టి..ఆ రేట్ .. రేంజ్ ..రెండూ మారిపోతాయి. సో..ఈ లెక్కన మరో 100 కోట్లు ప్రభాస్ తన  అకౌంట్ లో వేసుకోవడం గ్యారంటీయే అంటున్నారు ఫ్యాన్స్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: