అనుష్క  కొంత‌ గ్యాప్ త‌ర్వాత నిశ‌బ్దం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌విష‌యం తెలిసిందే. జీరోసైజ్ చిత్రంతో కాస్త వెయిట్ పెర‌గ‌డంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ‌ ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతుంది.ఈ సినిమాలో హీరోయిన్ మూగ పాత్ర చేయగా, హీరో గుడ్డివాడైన గాయకుడి పాత్రలో క‌నిపించ‌న‌న్నారు. ఇప్పుడు ఈ ‘నిశ్శబ్ద్టం’ సినిమాలో కూడా అనుష్క మూగదైన పెయింటర్ గా కనిపిస్తుండగా మాధవన్ అంధుడైన మ్యూజిషియన్ పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా గోపి సుందర్ వ్యవహరిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 2న విడుద‌ల కానున్న ఈచిత్రం 15ఏళ్ళ సినీ కెరియ‌ర్ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెను ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా

 

ఛార్మి మాట్లాడుతూ... అనుష్క నాకు సూప‌ర్ చిత్రం నుంచి తెలుసు. అప్పుడు క‌లిసి ప‌ని చేశాము. ఆ స‌మ‌యంలో నేను మాస్ చిత్రం చేస్తున్నాను. అప్పుడు నేను సీనియ‌ర్‌క‌దా ఓహో కొత్త‌గా వ్చిందా. స‌రే రా...రా... అంటూ పిలిచేదాన్ని. ఆ త‌ర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆమె ఒక అమ్మ‌లాంటిది.అంద‌రూ కూడా ఆమెను అమ్మ అని పిల‌వ‌వ‌చ్చు. ఇంత‌కు ముందు పూరిగారు చెప్పిన‌ట్లు మా టీమ్ అంతా ఆమెను అమ్మ అని పిలుస్తాము. ఆమెకున్న టాలెంట్‌కి ఆమెకు చేతులు ఎత్తి న‌మ‌స్క‌రించ‌వ‌చ్చు.  ఎందుకంటే ఆమెకు అన్నీ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. అస‌లు మ‌న‌మెవ్వ‌రం అనుష్క అలా ఉంట‌ద‌ని ఊహించం అంత మంచిది. త‌న‌కు ఎంతో ఓర్పు, నేర్ప‌రిత‌నం, ఎంతో బ్యాలెన్సింగ్‌, అస‌లు చెప్పాలంటే త‌ను ఒక అద్భుతం అని చెప్పాలి. ఒక్క‌సారి త‌ను మ‌న‌సారా హ‌గ్ చేసుకుంటే చాలు ఎంతో ప్రేమ‌గా ఆప్యాయ‌త‌గా చేసుకుంట‌ది. ప‌దిహేనేళ్ళు సినీ కెరియ‌ర్‌ని సాగించ‌డ‌మంటే అది మాములు విష‌యం కాదు. 

 

ఇప్ప‌టి వ‌ర‌కు అనుష్క న‌టించిన త‌న 15ఏళ్ళ కెరియ‌ర్‌లో చాలా మంచి చిత్రాల్లో న‌టించింది. మొన్న నిశబ్దం చిత్రం చూశాను. చంపేసింది అంతే అందులో నిజంగానే ఆమె మూగ అమ్మాయా అన్న‌ట్లు న‌మ్మేస్తాము మ‌న‌ము అంత అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించింది. సినిమా కూడా చాలా బాగా వ‌చ్చింది. హేమంత్‌గారు కూడా మంచి ఫ్రెండ్ లాంటివారు మాకు. నేను చాలా మ‌న‌స్ఫూర్తిగా చెబుతున్నాను. ఎప్పుడూ కూడా ఏ సినిమా ఆడాలి అని దేవుడిని కోరుకోను ఒక్క నా చిత్రం త‌ప్పించి. నా చిత్రం మంచి హిట్ కావాల‌ని కోరుకుంటాను. కాని మొద‌టిసాని నేను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నిశ‌బ్దం చిత్రం మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: