కన్నడ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ విన్నర్, కన్నడ ప్రముఖ ర్యాపర్‌ గాయకుడు చందన్‌శెట్టి, నివేదితా గౌడ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  ప్రేమించి పెద్దలను ఒప్పించి ఈ జంట ఒక్కటయ్యారు.   నివేదితా తల్లిదండ్రులు హేమా, రమేష్, దంపతులు, చందన్‌శెట్టి తల్లిదండ్రులు  ప్రేమలతా, పరమేష్‌లు, బంధుమిత్రులు, పలువురు సినీనటులు కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా చందన్‌శెట్టి మాట్లాడుతూ... ‘పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. ఇక పైన నాతో పాటు నా భార్య నివేదితా కూడా ఉంటుంది’ అని సంతోషంగా తెలిపారు.  అంతా హ్యాపీగా జరిగింది.. ఇక పెళ్లైన కొత్త జంట హనీమూన్ వెళ్లారు.. కాకపోతే ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి ఈ జంటకు.  వీళ్లు హనీమూన్ వెళ్లింది ఎక్కడికో కాదు కరోనా తో భీతుల్లుతున్న ఇటలీ.  

 


ఇప్పటికీ ఇక్కడ కరోనా వైరస్ భారిన పడి వెయ్యి మంది వరకు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు ఏపిలో నెల్లూరి వాసి ఇటీవల ఇటలీ నుంచి వచ్చాడు.. ఇతనికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు.  ఏపిలో మొదటి కేసు ఇదే. తాజాగా  కరోనా భయాందోళన, ఇప్పుడు కన్నడ గాయకుడు, ఇటీవల వివాహం చేసుకున్న చందన్‌ శెట్టిని తాకింది. ఈ జంట వెళ్లిన తరువాత కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో, తమ ఆనందాన్ని పక్కన పెట్టి, ప్రయాణాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి ఇండియాకు బయలుదేరారు. 

 


ఈ వార్త తెలియగానే, మైసూరులో పలు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసిన పలువురు, ఇంతవరకూ మైసూరులో కరోనా లేదని, వారిద్దరినీ నగరంలోకి వెంటనే అనుమతించ వద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు సామ్యనులకు ఎలా ట్రీట్ మెంట్ ఇస్తున్నారో..  14 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి, ఆపై మాత్రమే వారిని అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరోనా భారిన సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: