మన తెలుగు హీరోల లో ఆ కాలం నాటి టాప్ హీరో మన అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున అప్పటి నుండే ఎన్నో సినిమాలలో నటించాడు. అగ్ర హీరోయిన్లతో కూడా అనేక చిత్రాలలో నటించాడు కింగ్ నాగార్జున. ఈ గ్రీకువీరుడు ఎప్పుడు యంగ్ గానే ఉంటాడు. అయితే ఈ గ్లామర్ వెనుక సీక్రేట్ తెలియనే లేదు. కానీ ఇలా ఉన్నా సరే చిత్రాలలో ఆ ఊపు తగ్గనే లేదు.  హిట్లు అందుకోవడం తగ్గనే లేదు. 
 
IHG
 
 
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఆనాటి నుండి ఉన్న సీనియర్ హీరోల లో మన అక్కినేని నాగార్జున ఒకరు. తన దైన నటన తో విభిన్న పాత్రలలో నాగార్జున మంచి గెలుపుని తన ఎకౌంట్ లో వేసుకున్నాడు. తనకి తగ్గట్లు, ప్రేక్షకులు మెచ్చేట్లు ఉన్న వాటిని కింగ్ నాగార్జున ఎంచుకుంటాడు. వివిధ పాత్రలని నటిస్తాడు. అలానే మంచి కధలనీ, పాత్రలనీ చక్కగా నటిస్తూ ఓ గొప్ప సినిమాని అందిస్తాడు. ఇదే కాకుండా చక్కని పాత్రల తో  ఎన్నో మంచి చిత్రాలలో కూడా అలరించాడు, పోషించాడు నటుడు నాగార్జున. 
 
 
బిగ్ బాస్ హోస్ట్ మాత్రం ఎక్కడా తగ్గడు. హస్యమైనా, కోపమైనా, బాధైనా ఒకటే. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని తేడా వస్తే తిట్టేసాడు అలానే వారు బాధ పడితే కంట తడి పెట్టుకున్నాడు ఈ మన్మధుడు. ఇలా ఎంతో ఉత్సాహంతో ఈ హీరో జనానికి ఊపు తెప్పించాడు. షో అంతా కెవ్వుమనేలా మార్చేసాడు.
 
IHG
 
 
ఎన్నో మంచి హిట్స్ అందుకున్నాడు తన సినీ కెరీర్లో మన్మధుడు వంటి ఎవర్ గ్రీన్ సినిమాలని కూడా అందించాడు ఈ హీరో. మనం, డాన్, అన్నమయ్య, మాస్, బాస్, మన్మధుడు, శ్రీరామదాసు, సూపర్, దేవదాస్, సంతోషం, నేనున్నాను ఇలా అనేక సినిమల్లో నటించాడు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: