గేమ్ లో ఒక్కొక్కళ్లకు ఒక్కో ప్లాన్ ఉంటుంది. గోల్ కొట్టడానికి ఎవరి స్ట్రాటజీ వాళ్లు ప్లే చేస్తుంటారు. కానీ మన హీరోలందరూ నార్త్ ని ఇంప్రెస్ చేసేందుకు ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ముంబై గ్లామర్ ను దిగుమతి చేసుకుంటున్నారు. 

 

పవన్ కళ్యాణ్ కు పెద్దగా కాలిక్యులేషన్స్ ఉండవు. వసూళ్ల లెక్కలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాడని చాలామంది చెబుతారు. అయితే అలాంటి హీరో కూడా నార్త్ లో మార్కెట్ సంపాదించేందుకు అందరిలాగే ఆలోచిస్తున్నాడు. బిజినెస్ కోసం బాలీవుడ్ భామని దింపుతున్నాడు పవన్ కళ్యాణ్. 

 

పవన్ కళ్యాణ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామాలో నటించబోతున్నాడు. భారతదేశాన్ని బ్రిటీషోళ్లు పాలించిన కాలం నాటి కథాంశంగా తెరకెక్కుతోంది సినిమా. పాన్ ఇండియన్ మూవీగా ప్లాన్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ మూవీకి నార్త్ లోనూ క్రేజ్ తీసుకురావడానికి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారట. వకీల్ సాబ్ పూర్తయ్యాక పవన్సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడని సమాచారం. 

 

బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ కే సైన్ చేస్తున్నాడు ప్రభాస్. మల్టీలింగ్వల్స్ తో మార్కెట్ పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా నార్త్ లో స్టార్డమ్ పెంచుకోవడానికి పరుగులు పెడుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ భారీ బడ్జెట్ లకు తగ్గ బిజినెస్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ ని దింపుతున్నాడు. 

 

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నాడు. మొహంజదారో, హౌస్ ఫుల్ 4 సినిమాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా. ఇక ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మల్టీ లింగ్వల్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రీన కైఫ్ ను హీరోయిన్ గా తీసుకుంటారనే టాక్ వస్తోంది. ఇక సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ తో స్టెప్పులేస్తున్నాడు ప్రభాస్.  

 

అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. మల్టీ లింగ్వల్స్ తో కంప్లీట్ సౌత్ స్టార్ గా మారాలనుకుంటోన్న విజయ్, పూరీ దర్శకత్వంలో బాలీవుడ్ కి వెళ్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కరణఅ జోహార్ సహనిర్మాత. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వెయిట్ పెంచేందుకు అనన్య పాండేని హీరోయిన్ గా తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: