టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. మహేష్ బాబు క్రేజ్ అలాంటిది. ఆయనతో సినిమా అనగానే నిర్మాతలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అతనితో సినిమా కోసం ఇతర సినిమాలను కూడా వాయిదా వేసుకుని కొందరు హీరోయిన్లు కూడా ఉన్నారు మన టాలీవుడ్ లో. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు సినిమాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని టాలీవుడ్ లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు తో సినిమా చేయడానికి కొందరు దర్శకులు ముందుకి రావడం లేదు. 

 

వాస్తవానికి సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా నష్టాలు కూడా భారీగానే ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. నిర్మాతగా మహేష్ బాబుకి ఈ సినిమా భారీ నష్టాలు ఇచ్చింది అనేది కొందరి మాట. ప్రకటిస్తున్న వసూళ్లు అన్నీ కూడా ఫేక్ అనేది కూడా ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో. దీనితో నిర్మాతలు భయపడుతున్నారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే భయపడతారా అంటారా...? దానికి పెద్ద కారణం ఉంది. మహేష్ బాబు సినిమాలో అతని నిర్మాణ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. 

 

దీనితో నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఫ్లాప్ అయితే. అందుకే ఆయన తో సినిమా చేయడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అదే విధంగా మహేష్ బాబు ఇప్పుడు ఎవరితో సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా టాలీవుడ్ జనాల మాట. ఆయన ముందు వంశీ పైడపల్లి తో సినిమా చెయ్యాలని చూసారు. ఆ తర్వాత కథ నచ్చకపోవడంతో ఆ కథను మార్చారు. అయినా మహేష్ బాబుకి పెద్దగా నచ్చలేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దీనితో ఎవరితో సినిమా చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారట మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: