టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంతా అక్కినేని. ఆమెతో సినిమా చేయడానికి ఎందరో దర్శకులు గతంలో పోటీ పడే వారు. అయితే ఇప్పుడు ఆమె కాస్త కెరీర్ లో ఇబ్బంది పడుతుంది. పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేసింది సమంతా. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా. దీనితో ఆమె క్రేజ్ కూడా అమాంతంగా మరోసారి పెరిగింది. ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనితో సినిమాల నుంచి ఆమె తప్పుకుంటే మంచిది అనే సలహాను ఇస్తున్నారు కొందరు. 

 

ముఖ్యంగా ఆమె కుటుంబం నుంచి ఎక్కువగా ఒత్తిడి వస్తుంది అనేది టాలీవుడ్ జనాల మాట. ఆమె భర్త నాగ చైతన్య ఆమెను సినిమాలు వద్దని చెప్పాడట. ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలు అన్నీ పూర్తి చేసి త్వరలో ఆమె సినిమాల నుంచి తప్పుకోవాలని అటు మామ నాగార్జున కూడా సూచించారు అంటున్నారు. దీనికి సమంతా కూడా అంగీకరించింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమెకు కూడా సినిమాలు చెయ్యాలనే ఆసక్తి పెద్దగా లేదని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలని భావిస్తు౦దని టాలీవుడ్ జనాలు గుస గుసలు ఆడుతున్నారు. 

 

త్వరలో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆమెను సంప్రదిస్తున్న దర్శకులకు కూడా ఆమె చెప్పిందని, అటు నిర్మాతలు కూడా ఆమెను లైట్ తీసుకున్నారని అంటున్నారు. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పక్కన ఆమె సినిమా చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా నుంచి ఆమె స్వయంగా తప్పుకుంది అంటున్నారు. దీనితోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని ఎంపిక చేసారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని కొంత కాలం వేచి చూస్తే కచ్చితంగా ఒక ప్రకటన వచ్చే సూచనలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: