తెలుగు యాంకర్స్ అన‌గానే.. సుమ, ఝాన్సీ, రోజా, రెష్మీ శ్రీముఖి, అనసూయ, వర్షిణి, విష్ణు ప్రియా పేర్లు ట‌క్కున గుర్తుకువ‌స్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు లో ఎంద‌రో యాంక‌ర్స్ పుట్టుకొచ్చారు. అందులో కొంద‌రు  గ్లామర్ తో కట్టిపడేస్తే.. మ‌రికొంద‌రు మాట‌ల‌తో క‌ట్టిప‌డేస్తారు. అయితే వీరితో పాటు కొంతమంది తమ యాంకరింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నారు.. ఫలానా ప్రోగ్రామ్ కి ఫలానా యాంకర్ యాంకరింగ్ సూపర్రా అనిపించుకున్నవారు ఉన్నారు. కానీ ఇప్పుడు తెరమరుగయ్యారు. మ‌రి వారిపై ఓ లుక్కేసేయండి.

 

చిత్రలేఖ.. తెలుగుని అనర్ఘలంగా మాట్లాడిగలిగే యాంకర్స్ లో ఈమె ఒకరు. మ‌రియు క్లాస్ మెట్స్, శంభో శివ శంభో, పరుగు, దమ్ము, లయన్, దళం తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసింది చిత్రలేఖ. ఏ ప్రోగ్రామ్ కైనా, ఏ ఛానల్ కైనా యాంకర్ చిత్రలేఖ న్యాయం చేస్తారు. డ్యాన్స్ షో, టాక్ షో, మ్యూజిక్ షో ఏదైనా ఓకే. అందుకే యాంకర్ గా రాణీ చిత్రలేఖ బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా చిత్రరంజిని ప్రొగ్రామ్ తో స్టార్ట్ అయిని చిత్రలేఖ కెరీర్ మా ఊరి వంట ప్రోగ్రామ్ ద్వారా ఊపందుకుంది. ప్ర‌స్తుతం ఈమె ఎక్క‌డా కూడా క‌నిపించ‌డం లేదు.

 

భార్గవి.. ఆటకావాలా పాటకావాల ప్రోగ్రామ్ ని హోస్ట్ చేసింది భార్గవి. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అప్పుడుప్పుడు కొన్ని ఆడియో ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేసినప్పటికి పూర్తి స్థాయి యాంకరింగ్ ప్రోగ్రాయ్‌ మాత్రం చేయలేదు. ఇక్క‌డ‌ మ‌రో విష‌యం ఏంటంటే.. భార్గ‌వి తెలుగులో లెజెండరీ దర్శకుడు కార్టూనిస్ట్ బాపు గారి మ‌న‌వ‌రాలు.

 

లికితా కామిని.. బుల్లితెర ప్రేక్షకులను అమాంతం కట్టిపడేసి సీరియల్ మొగలి రేకులు.  ఈ సీరియ‌ల్‌లో దేవి క్యారెక్టర్ గా అందరికి పరిచితురాలు లికితా కామిని. ఈమె కూడా కొన్ని ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత సీరియల్స్, సినిమాల్లో అడుగుపెట్టింది. అయితే కార‌ణాలు ఏంటో తెలియ‌దు గాని మొగలి రేకులు సీరియ‌ల్ నుంచి ఔట్ అయిన ఆమె మ‌ళ్లీ ఏ షోకు యాంక‌రింగ్‌గాని, సీరియ‌ల్‌గాని చేయ‌లేదు.

 

కీర్తి..  జెమిని టివిలో డాన్స్ బేబీ డాన్స్ షోలో యాంకర్ గా అదరగొట్టింది. ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రాం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు యజ్ఞం మూవీలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో ముస్లిం యువతిగా వేసిన జాహ్నవి పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేసింది. డ్యాన్స్ బేబి డ్యాన్స్ షోతో   కీర్తి యాంక‌ర్ మంచి పేరు సంపాధించుకుంది. ఆ షోకి యాంకరింగ్ చేసింది జాహ్నవినే..మరెందుకో ఇప్పుడు అటు సినిమాలు,ఇటు యాంకరింగ్ అన్నింటికి దూరంగా ఉంటూ..  కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: