టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ కొరత ఎక్కువగా ఉంది అనేది కొన్ని రోజుల నుంచి మనం వింటున్న మాట. ఇతర భాషల హీరోయిన్స్ తో మన దర్శక నిర్మాతలు ఎక్కువగా చర్చలు జరుపుతూ వస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మంచి హీరోయిన్ దొరకడం లేదు. ఎటు చూసినా సరే పూజ హెగ్డే లేదా రష్మిక మందన మినహా ఎవరూ కనపడట౦ లేదు టాలీవుడ్ లో. దీనితో ఇప్పుడు దర్శకులు కాస్త కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారని అంటున్నారు. ప్రస్తుతం టిక్ టాక్ హీరోయిన్స్ మీద దృష్టి పెట్టారట. 

 

ఈ మధ్య టిక్ టాక్ లో అందమైన అమ్మాయిలు ఎక్కువగా కనపడుతున్నారు. ఈ ప్రముఖ చైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో హీరోయిన్స్ ని వెతికే పనిలో పడ్డారు. పాటలు పాడుతూ డైలాగులు చెప్తూ ఎక్కువగా హడావుడి చేస్తున్నారు వాళ్ళు. దీనితో వాళ్ళ ను ఆడిషన్ కి కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇటీవల ముగ్గురు అమ్మాయిలను ఆడిషన్ కి పిలవగా ఒక అమ్మాయిని ఓకే చేసారని అంటున్నారు. మరి కొంత మందిని ఆడిషన్ కి పిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారట. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. అగ్ర హీరోల సినిమాలకే హీరోయిన్ లు దొరకడం లేదని దర్శకులు వాపోతున్నారు. దీనితో టిక్ టాక్ అమ్మాయిల టాలెంట్ ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. మరి ఇది ఎంత వరకు విజయవంతం అవుతుంది అనేది చూడాలి. వాళ్ళు పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి దర్శక నిర్మాతలు వారిని సినిమాల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: