తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ ఏపిలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.  మూడు నెలలు వరుసగా టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. హిందూ పురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  అయితే బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీవైపు మొగ్గు చూపుతున్నారు.  ఆ మద్య కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ చిత్రంలో నటించాడు.  కానీ ఈ చిత్రం అనుకున్నంతగా హిట్ కాలేదు. దాంతో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో గతంలో తనకు హిట్ ఇచ్చిన బోయపాటినే నమ్ముకున్నారు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.

 

మాస్ ఇమేజ్ ను సరిగ్గా హ్యాండిల్ చేస్తాడని పేరున్న బోయపాటి, బాలయ్యను సరిగ్గా ప్రెజంట్ చేయగలడని నిరూపించుకున్నాడు. ఆ నమ్మకంతోనే బాలయ్య, బోయపాటితో మరోసారి వర్క్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.  గతంలో ఫెయిల్యూర్స్ దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్, హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఏవీ ప్రేక్షకులకు రివీల్ చేయలేదు. 

 

ఇందులో బాలకృష్ణ ఒకటి అఘోరా గెటప్ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.  అయితే ఇందులో ఏవి నిజాలన్నవి మాత్రం తెలియలేదు. ఇంకా టైటిల్ ఏంటి, హీరోయిన్ ఎవరు వంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు షూటింగ్ ను శరవేగంగా జరిపించాలని నిర్ణయించాడు బాలయ్య.  ఎలాగైనా మేకు చిత్ర షూటింగ్ మొత్తం పూర్తైపోవాలన్నది బాలయ్య ఆలోచన. అయితే రూలర్ తర్వాత బాలయ్యను మరో లుక్ లోచూడాలని ఆత్రంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. మరి ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఎదరు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: