శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో గుణాలు తేనె అందిస్తోంది. యాంటిబ్యాక్టీరియ‌ల్‌, యాంటి ఫంగ‌ల్ గుణాలు తేనెలో ఉన్నాయి గ‌నుక అది శ‌రీరంలోని రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచి బ‌లాన్ని ఇస్తుంది. అయితే తేనెలో వారం రోజుల పాటు నాన‌బెట్టిన ఎండుఖ‌ర్జూరం పండ్ల‌నుతింటే ఎన్నో లాభాలున్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు తేనె ఖ‌ర్జూరం ఎలా త‌యారు చేయాలంటే... ఒక జార్‌లో తేనె తీసుకుని విత్త‌నాలు తీస‌ని ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను వేయాలి. త‌ర్వాత మూత బిగించి ఆ జార్‌ను బాగా షేక్ చేయాలి. 

 

అనంత‌రం ఆ జార్‌ను వారం రోజుల పాటు అలానే ఉంచాలి. అవ‌స‌ర‌మ‌నుకుంటే మ‌ధ్య మ‌ధ్య‌లో ఆ జార్‌ను షేక్ చేయ‌వ‌చ్చు. వారం త‌ర్వాత షేక్ చేసి రోజుకొక పండు చ‌ప్పున ఆ ఖ‌ర్జూర‌పండ్ల‌ను తినాలి. ఇలా తిన‌డం వ‌లన మ‌న‌శ‌రీరంలో చాలా మార్పులు ఉప‌యోగాలు ఉన్నాయి. తేనె ఎండుఖ‌ర్జూరం తిన‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌స‌మ‌స్య‌లు పోతాయి. జ్వ‌రం కూడా పోతుంది. నిద్ర‌లేమితో బాధ‌ప‌డేవారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే మంచి ఫ‌లితాన్ని ఇస్తుంది. ఒత్తిడి ఆందోళ‌న వంటివి త‌గ్గిపోతాయి. గాయాలు త్వ‌ర‌గా మాన‌తాయి. యాంటి బ‌యోటిక్ గుణాల వ‌ల్ల గాయాలు పుండ్లు త్వ‌ర‌గా మాన‌తాయి. చిన్నారుల‌కు రోజూ ఈ మిశ్ర‌మాన్ని తినిపిస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.

 

 పెద్ద‌లు కూడా ఈ మిశ్ర‌మంతో త‌క్ష‌ణ శ‌క్తిని పొందుతారు. ఇంకా మ‌హిళ‌ల‌కు కావ‌ల‌సిన ఐర‌న్‌, క్యాల్‌షియం పుష్క‌లంగా ల‌భిస్తాయి.  ఇవి ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించి ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ర‌క ర‌కాల అజ‌ర్జీలు కూడా పోతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు ద‌రిచేర‌వు. అంతేకాక ప‌లుర‌కాల క్యాన్స‌ర్ల‌కు కూడా ఈ మిశ్ర‌మం విరుగుడుగా ప‌నిచేస్తుంది. శ‌రీర‌బ‌రువును త‌గ్గిస్తుంది. టి.బి. ఉన్న‌వాళ్ళ‌కి మంచి ఔష‌ధంగా ప‌నిచేస్త‌ది. అంతేకాక దీన్ని తిన‌డం వ‌ల్ల పురుషుల్లో శ‌క్తి అధిక‌మై రోజంతా ఎంత ప‌ని చేసినా కూడా అల‌స‌త్వం అనేది రాదు. అంతేకాక శృంగారంలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. ఎంత సేపు చేసిన‌ప్ప‌టికీ స‌రిపోదు.

మరింత సమాచారం తెలుసుకోండి: