తెలుగులో ఓ దశలో టాప్ పొజిషన్ అనుభవించిన హీరోయిన్ త్రిష. కొన్నాళ్లు నెంబర్ వన్ గా కూడా రాణించింది. తెలుగు, తమిళ్ లో ఏక కాలంలో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అనుభవించింది. హీరోయిన్ గా వచ్చి 17 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు లేని త్రిషకు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. మరో వారంలో సెట్లో అడుగుపెట్టాల్సి ఉండగా సడెన్ త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలిసింది.

 

 

ఈరోజు సామాజిక మాధ్యమాల్లో గాసిప్ గా వచ్చిన ఈ వార్తను స్వయంగా త్రిష తన ట్విట్టర్ ద్వారా అఫిషియల్ గా ప్రకటించింది. ‘కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవు. ముందు చెప్పినదానికి తర్వాత చేయబోయేదానికి వ్యత్యాసాలు వస్తాయి. చిరంజీవి సర్ సినిమాలో అటువంటి క్రియేటివ్ పరంగా డిఫరెన్సెస్ రావడం వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను. చిత్ర టీమ్ కు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మరో మంచి సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తాను’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆచార్య నుంచి త్రిష బయటకు వచ్చేసినట్టు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. త్రిషకు మొదట చెప్పినది ఆన్ టైమ్ లొకేషన్ లో చెప్పిన స్క్రిప్ట్ మార్చినట్టు త్రిష ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

 

 

ఇప్పటికే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ ఎవరు చేస్తారో అర్ధం కాని పరిస్థితుల్లో.. ఇప్పుడు హీరోయిన్ తప్పుకోవడంతో ఆచార్య టీమ్ కు కొత్త తలనొప్పులు వచ్చినట్టైంది. ఇప్పుడు ఓ హీరో కోసం, మెయిన్ హీరో కోసం వేట మొదలెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి.. కొరటాల శివ ఇప్పుడేం చేస్తాడో చూడాలి. కాజల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: