బాలీవుడ్ లో కంగనా చౌదరి గురించి తెలియని వారు ఉండరు.  ఆ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ మూవీలో నటించింది.  ఆ తర్వాత తెలుగులో మరే మూవీలో నటించలేదు. బాలీవుడ్ లో కంగనా పేరు ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే మారు మోగుతుంది.  ఏ విషయమైన ఆమె ఓపెన్ గా బోల్డ్ గా మాట్లాడటం చూస్తూనే ఉన్నాం.  గతంలో తనను ఇండస్ట్రీ పెద్దలు మానసికంగా హించారని.. కాస్టింగ్ కౌచ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.  అంతే కాదు సినీ పరిశ్రమలోకి రావాలంటే పడక సుఖం అందించాల్సిందే.. లేదంటే వారిని గెటు వద్దే ఉంచుతారని సంచలన వ్యాఖ్యలు చేసింది.  


ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక మూవీలో నటించింది. అయితే కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. ఆ తర్వాత ఆమె ఈ మూవీకి డైరెక్షన్ చేసి మంచి విజయం అందుకుంది.  అయితే కంగనాను ఎవరేమన్నా అన్నా ఆమె సోదరి రంగోలి ఒంటికాలుపై లేస్తుంది. తాజాగా రంగోలి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత హీరోయిన్‌లలో ఎవరైనా రూ. 60 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్‌తో లేడి ఓరియంటెడ్‌ సినిమాలు తీస్తే.. తన సోదరి.. కంగనారనౌత్ తన నటనను పూర్తిగా వదులుకుంటుందని ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది రంగోలి. 


నేను పరిశ్రమకు బహిరంగంగా సవాలు చేస్తున్నాను. కంగనా కాకుండా ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా లేడి ఓరియంటేడ్‌ సినిమాలను  రూ. 100 కోట్ల బడ్జేట్‌తో తీస్తే. ఇక కంగనా తన  యాక్టింగ్ కెరీర్ కి పులిస్టాప్ పెడుతుంది.. లేదంటే నా పేరు మార్చుకుంటా అంటూ ఓపెన్ చాలెంజ్ చేసింది. ఈ నేపథ్యంలో రంగోలీ ట్వీట్ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: