అందాల భామ మాళవికా శర్మ‌కి ఇపుడు కొత్తగా కొన్ని విషయాలు తెలిసివచ్చాయట. టాలీవుడ్లో నాలుగేళ్ళ క్రితం ఎంట్రీ ఇచ్చిన మాళవిక నేల టికెట్ తో పక్కా మాస్ హీరోయిన్ అయిపోదామనుకుంది. పైగా రవితేజా పక్కన అంటే ఇక మినిమం హిట్ అనుకుంది. అయితే అక్కడే సీన్ సితారైంది.

 

ఆ తరువాత ఆ మూవీ ఫట్ కావడంతో మాళవిక ఆశలు కూడా అడుగంటాయి. ఆమె మళ్ళీ గట్టిగా ట్రై చేసినా కూడా టాలీవుడ్లో చాన్సులు రాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే మాళవిక వదలకుండా చేసిన పని ఒకటి ఉంది. అదే సోషల్ మీడియాతో పాటు, ఇన్స్ట్రాగ్రాంలో ఆమె పిక్స్ అదిరిపోయే రేంజిలో పెట్టడం. హీటెక్కించే ఫోజులతో సోయగాలను ఎడా పెడా  పరచేయడం.

 

దాంతో మాళవికకు మళ్ళీ చాన్నాళ్ళకు టాలీవుడ్లో చాన్స్ వచ్చింది. రెడ్ మూవీలో ఆమె ఇపుడు ఎనర్జిటిక్ స్టార్ రాం పక్కన నటిస్తోంది. ఆ మూవీలో మాళవిక హద్దులు లేని అందాల ప్రదర్శన చేసిందట. తాను ఏంచేస్తే  హిట్ అవుతానో ఆ టెక్నిక్కులు  అన్నీ ఈ మూవీలో ప్రయోగించిందట. 

 

దాంతో రెడ్ మూవీ కాస్తా మాళవిక అందాలతో మోతెక్కడం ఖాయమని అంటున్నారు. సినిమా పేరు రెడ్ అయినా మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక ఇక అంతా తడి తమాషాలేనని కూడా అంటున్నారు. సో మాళవిక రాక రాక వస్తూ అందాలను దోరదోరగా  మోసుకొస్తోంది. వాటిని వీక్షించి తరించడం యూత్ చేసుకున్న భాగ్యమే అనుకోవాలి. 

 

ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ మూవీలో మంచి ఊపు మీద రాం ఉన్నాడు. ఆ మూవీలో ఇద్దరు ముద్దు గుమ్మలు నిధి అగర్వాల్, నభా నటేష్ లకు మంచి లైఫ్ ఇచ్చిన రాం ఈ మూవీతో మాళవికను కూడా ఒడ్డున పడేస్తారని అనుకుంటోందిట. ఈ దెబ్బతో తాను కూడా టాలీవుడ్లో పాగా వేయగలనని గట్టిగా నమ్ముతోందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: