రెండేళ్ల క్రితం తెలుగు  ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బ్లాక్ బస్టర్  సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. కన్నడ నటుడు రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి  హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా కన్నడ ప్రతిష్టాత్మక సంస్థ హోంబేలె ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. అప్పట్లో కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వంటి పలు ఇతర దేశీయ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా, అన్ని భాషల్లో కూడా అత్యద్భుత విజయాన్ని అందుకుని అతి పెద్ద రికార్డు ని సొతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్ 2 వేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. 

 

ఇటీవల ఈ సినిమా షూటింగ్ కు కొన్ని కారణాల వలన బ్రేకులు పడడంతో షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందని, అలానే సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని కొన్ని వార్తలు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుండగా, వాటన్నిటికీ చెక్ పెడుతూ, సినిమా యూనిట్ నేడు తమ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ని  అనౌన్స్ చేసింది. రాబోయే దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాని అక్టోబర్ 23న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. 

IHG

 

ఇక మొదటి భాగంతో పోలిస్తే ఈ రెండవ భాగంలో మరిన్ని యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని సమాచారం. సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీర గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రధాన మంత్రి రమిక సేన్ గా నటి రవీనా టాండన్ నటిస్తుండగా ఒక కీలక పాత్రలో మన టాలీవుడ్ నటుడు రావు రమేష్ నటిస్తున్నారు. ఇప్పటికే  చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ లుక్ టీజర్ ప్రస్తుతం సిద్ధం అవుతోందని, అలానే దానిని ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నట్లు చెప్తున్నారు.  ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా అని ఎన్నో ఎదురుచూపులు చూసిన అభిమానులకు ఈ అనౌన్సుమెంట్ మంచి కిక్ ని ఇచ్చింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: