టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషా కి మంచి క్రేజ్ ఉంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి పక్కన నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు తమిళ సినిమా రంగంలో వరస విజయాలు సాధించింది. అయితే ఒకానొక సమయంలో చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ కావటంతో అదే టైమ్ లో వ‌రుణ్‌మ‌ణిమ‌న్ అనే నిర్మాత‌, వ్యాపార‌వేత్త‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయి సినిమా కెరియర్ ని పూర్తిగా పక్కన పెట్టేసి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.

 

అయితే చివరాకరికి ఆ ప్రేమ పెటాకులైంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు పైగానే కావస్తున్నా గాని త్రిష ఏ మాత్రం తన అందంలో చెక్కుచెదర లేకుండా కుర్రకారును మత్తెక్కిస్తు ప్రస్తుతం మళ్లీ సినిమా రంగంలో దూసుకుపోతోంది. ఇటువంటి తరుణంలో త్రిష పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. నీ పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా..? అని యాంకర్ ప్రశ్నించగా. దానికి ప్రశ్న సమాధానం చెబుతూ...కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అయితే కుటుంబ పెద్ద‌లు చెప్పిన‌, చూసిన వాడిని మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెళ్లి చేసుకునేది లేద‌ని త్రిష కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పింది.

 

ఆరు నూరైన‌, నూరు ఆరైనా స‌రే....ప్రేమించే పెళ్లి చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కు కావాల్సిన వ‌రుడి అర్హ‌త‌ ల‌ను కూడా త్రిష ఓ లిస్ట్ చెప్పింది. చాలా చురుకుగా ఉండాలని  అలాగని హీరో అవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పి పైగా అందంతో కూడా పనిలేదని మంచి మనసు ఉంటే చాలా అని చెప్పింది. ఇదే టైం లో ఒక కండిషన్ కూడా పెట్టింది. అదేమిటంటే తనని బాగా అర్థం చేసుకునే వాడు గా ఉండాలని అలాంటి వ్యక్తి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటానని త్రిష చెప్పుకొచ్చింది. మరి త్రిష ని లవ్ చేసే కుర్రాళ్ళు .. పెళ్లి చేసుకోవాలి అనుకునే కుర్రాళ్ళు ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెళ్లి ప్రపోజ్ చేయండి, ఆల్ ది బెస్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: