ప్ర‌తి సంవ‌త్స‌రం సంక్రాంతి, దీపావ‌ళి, ఉగాది పండుగ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కుల‌కు హీరోలు ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళ కొత్త సినిమాల అప్‌డేట్ లేదా వాళ్ళ సినిమా రిలీజ్ లు పెట్టుకుంటూ ఉంటారు. మ‌రి ఈ సంవ‌త్స‌రం ఉగాదికి టాలీవుడ్ హీరోల‌కు పండ‌గే పండ‌గ అని చెప్పాలి. అయితే ఏ హీరో అని అనుకుంటున్నారా. ఒక్క హీరో కాదండి బాబూ... చాలా మంది హీరోల ఫ్యాన్స్‌కి పండ‌గ‌.

 

ఇక ఈ ఉగాదికి స్టార్ హీరోలు తమ ఫస్ట్ లుక్ లు, టీజర్ లను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మార్చి 24 పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రం టీజర్ ను విడుద‌ల చేయడానికి చిత్ర యూనిట్‌ నిర్ణయించారు. దాదాపు రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ప‌వ‌న్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇక సాహో త‌ర్వాత చేస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం మూవీ ఫ‌స్ట్ లుక్  ప్ర‌భాస్ ఫాన్స్‌కి గిఫ్ట్‌గా ఇస్తున్నారు. 

 

 సాహో ప్రభాస్  చిత్రం చేస్తున్న‌ ఫస్ట్ లుక్ కి  కూడా ఉగాది కానుకగా మార్చినెల‌ 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ’ఆచార్య’ చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఈ ఉగాదికే విడుద‌ల కానుంద‌ట‌. అలానే .. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ  టైటిల్ లోగోను ఉగాదికి రిలీజ్ చేయనున్నార‌ట‌. ఇక ఈచిత్రానికి ఉన్న క్రేజ్ గురించి అంద‌రికీ తెలిసిన విష‌యమే. మార్చి 27న మెగా హీరో రాంచ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రంలోని ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేస్తార‌ని రాజ‌మౌళి అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇక రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకన్న పెద్ద పండగ ఇంకేముంట‌ది. ఈ విధంగా మ‌న క్రేజీ టాప్ హీరోలు అంద‌రూ  వాళ్ళ వాళ్ళ అప్‌డేట్స్‌ని ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: