బాలయ్యకు గత గత ఏడాది అంతా వెరీ బ్యాడ్ గా నడచింది. ముచ్చట పడి తండ్రి ఎన్టీయార్ జీవిత చరిత్రతో తీసిన రెండు సినిమాలూ ఢమాల్ అన్నాయి. ఆ తరువాత చేసిన రూలర్ అయితే ఇలా వెళ్ళిన బాక్సులు అలా వెనక్కి వచ్చేశాయి. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య మార్కెట్ మీద ఇపుడు ఆయనకే డౌట్ వస్తోంది.

 

బాలయ్య కెరీర్ దాదాపుగా డేడ్ ఎండ్ కి వచ్చేసిందని ఫ్యాన్స్ సైతం కలవరపడుతున్నారు. ఇప్పటి హీరోల మాదిరిగా ఆలోచించకుండా బాలయ్య ఇంకా అవుట్ డేటెడ్ గా థింక్  చేయడం వల్లనే వరస ఫ్లాస్ ఎదుర్కొంటున్నాడని అంటున్నారు.

 

ఇపుడు బాలయ్య బోయపాటితో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో బాలయ్యని ఒడ్డున పడేయాల్సిన బాధ్యత బోయపాటి మీద ఉంది. అయితే బోయపాటికి కూడా ఇపుడు డేస్ అసలు బాగాలేవు. ఆయన సైతం భయంకరమైన ఫ్లాప్ వినయ విధేయ రామా రూపంలో ఇచ్చి  ఉన్నాడు.

 

దాంతో బోయపాటి బాలయ్యకి ఎంతమేరకు హిట్ ఇస్తాడో ఒక పెద్ద డౌట్. అయితే బాలయ్య, బోయపాటి రియలైజ్ అయి ఇప్పటి పరిస్థితులకు తగినట్లుగా చేస్తే మూవీ హిట్ అయ్యే చాన్సులు ఉన్నాయి.ఇదిలా ఉండగా బోయపాటి మూవీ తరువాత బాలయ్య రెండు కధలను రెడీ పెట్టుకుని కూర్చున్నాడుట.

 

అందులో ఒకటి చిన్ని క్రిష్ణ స్క్రిప్ట్ తో తయారైతే. రెండవది బాలయ్యకు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు మాటలు రాసిన బుర్ర సాయి మాధవ్ ది. ఇందులో ఒక సినిమాలో బాలయ్య ఓల్డ్ క్యారక్టర్ చేయాలి. రెండవ దాంట్లో అయితే సాయి మాధవ్ స్టైల్లో రేర్ స్టోరీట.

 

 మరి బాలయ్య దేనికి ఓటు వేస్తాడో. ఏది సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి. బాలయ్య  బీ గోపాల్ కాంబో అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య ఇప్పటి కాలానికి తగినట్లుగా మూవీస్ చేయకపోతే మాత్రం ఇమేజ్ డ్యామేజ్ కంప్లీట్ గా కావడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: