'బాహుబలి' సినిమా విజయంతో భారీ బడ్జెట్ లేనిదే ప్రభాస్ సినిమా చేయటం లేదు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా తన దగ్గరకు స్టోరీ చెప్పే డైరెక్టర్లకు ముందు ఈ విషయం చెప్పాక తర్వాత ప్రభాస్ స్టోరీ వింటున్నట్లు ఇటీవల వార్తలు అనేకం రావడం జరిగాయి. అందువల్లే బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ కలిగిన 'సాహో' సినిమా చేయటం జరిగిందని చాలామంది అంటారు. అప్పట్లో సాహో సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో జాతీయ మీడియా మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమా స్థాయికి మించి ప్రభాస్ కోసం సినిమా నిర్మాతలు యు.వి.క్రియేషన్స్ సంస్థ వాళ్లు బాగా ఖర్చు పెడుతున్నారని కథనాలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.

 

దీంతో 'సాహో' సినిమా మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు అని..లిమిటెడ్ బడ్జెట్ తో సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా బయ్యర్లకు లాభాల పంట పండిందని అప్పట్లో ట్రేడ్ వర్గాలకు చెందిన వారు కామెంట్ చేశారు. దీంతో ప్రభాస్ మైండ్ సెట్ మారాలి అని అందరూ భావించారు. దీంతో రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం తక్కువ బడ్జెట్ లో సినిమా ముగించేయాలని ప్రభాస్ చెప్పినట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగాయి. అయితే తాజాగా సినిమాలో యాక్షన్ సన్నివేశం కోసం అది కూడా ఒక నిమిషం లేదా నిమిషం నర కోసం ఏకంగా రెండు కోట్ల తో సెట్‌ వేశారట.

 

దాంట్లో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుతున్నారట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రభాస్ అభిమానులు వామ్మో అంత బడ్జెట్టా ?, ఎందుకు అంతగా ఖర్చు పెడుతున్నారు అని నిర్మాతలపై సీరియస్ అవుతున్నారు. మరోపక్క సాధారణ ప్రేక్షకులు, సినిమా ఏమాత్రం తేడా వచ్చినా ప్రభాస్ కొంప కొల్లేరు అవ్వటం గ్యారెంటీ అని సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: